ఇంటర్ విద్యార్థులకు పరీక్ష షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం..!!

Divya
ఇంటర్ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఎప్పుడో ఫిబ్రవరి నెలలోనే ముగియాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఇక తర్వాత విద్యార్థులకు సిలబస్ కూడా పూర్తికాకపోవడంతో పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా పూర్తయిన నేపథ్యంలో తాజాగా మెయిన్ పరీక్షల తుది తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ బోర్డ్ విడుదల చేయడం జరిగింది ఉంది. జే ఈ ఈ పరీక్షల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో ఇప్పటికీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలను మే 6 వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

కానీ జేఈఈ పరీక్షల కారణంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే కొత్త షెడ్యూల్ ను  విడుదల చేసింది ఇంటర్ బోర్డు. మారిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను మే 6వ తేదీన ప్రారంభమయ్యి మే 23వ తేదీతో ముగియనున్నాయి. సెకండియర్ పరీక్షల విషయానికొస్తే మే 7వ తేదీన ప్రారంభమయ్యే మే 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూల్ కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్..
మే 6 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -1
మే 9 – ఇంగ్లీష్ పేపర్-1
మే 11 – మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1
మే 13 – మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
మే 16 – ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
మే 18 – కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
మే 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)
మే 23 – మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1
సెకండ్‌ ఇయర్‌ షెడ్యూల్‌..
మే 7 – సెకండ్ లాంగ్వేష్ పేపర్-II
మే 10 – ఇంగ్లిష్ పేపర్-II
మే 12 – మ్యాథ్స్ పేపర్-II-A
మే 14 – మ్యాథ్స్ పేపర్-II-B, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
మే 17 – ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
మే 19 – కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II, సోషియాలజీ పేపర్-II, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II
మే 21 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, లాజిక్ పేపర్-II, మ్యాథ్స్ పేపర్-II (బైపీసీ విద్యార్థులకు)
మే 24 – మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: