ఏపీ:రాత్రిపూట చలి.. పగలుపూట ఎండలు.. కారణం..?

Divya
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎక్కువగా ఎండలు విస్తరిస్తూనే ఉన్నాయి.. ఈ నెలలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. గత సంవత్సరం మార్చి నెలలో పశ్చిమగోదావరి జిల్లాలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు గా తెలియజేశారు. ఇక 2021 వ సంవత్సరంలో ఇదే అత్యధికం గా నమోదు అయిన ప్రాంతంగా గుర్తించారు. కానీ ఈ ఏడాది మే నెలలో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండబోతోంది అన్నట్లుగా వాతావరణ శాఖ వారు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలియజేస్తున్నారు. గడచిన ఆదివారం అత్యధికంగా కృష్ణాజిల్లాలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు గా తెలుస్తోంది . ఇక కర్నూలు -38.6, విజయనగరంలో -37.4, శ్రీకాకుళంలో- 38.2, తూర్పుగోదావరి- 38.7, గుంటూరులో-38.4, చిత్తూరులో-39.2, నెల్లూరులో -39.6, అనంతపురం-38.9, కడపలో -39.3 డిగ్రీలుగా నమోదయినట్లుగా తెలియజేశారు. ఇలా చేయడానికి ముఖ్య కారణం గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల ఎండ ప్రభావం ఎక్కువగా చూపుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరుగుతుంది. ఇక గత సంవత్సరం మార్చి మొదటి వారం లోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ సంవత్సరం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎండ వేడి మాత్రం చాలా ఘోరంగా పెరిగిపోతోంది.

ఇక ఈ ఏడాది కోస్తా, తెలంగాణ, తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని పది రోజుల కిందటే తెలియజేయడం జరిగింది. ఇక ఈ ఉష్ణోగ్రతలను ప్రజలు చాలా దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. ఇక రానున్న కొద్ది రోజుల లోనే ఉదయం 10 గంట ల నుంచి సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: