అమ్మో ఈ పిల్లి మామూలుది కాదు.. వారిని పోలీస్ స్టేషన్ కు పంపింది..!

MOHAN BABU
ఈ పిల్లి మాది.మీరు ఎత్తుకొచ్చారు. ఇచ్చేయండి.. ఇస్తారా లేదా అంటూ మొదలైన లొల్లి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది.. మైసూరు నుంచి తెచ్చుకున్నామని ఒకరంటే.. లేదు మాదేనని మరొకరు పట్టుబట్టారు. పరస్పరం దాడులకు దిగారు. కాలనీవాసులు 100 కి ఫోన్ చేయగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సహజంగా కొట్లాటలతో.. వివాదాలతో న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్తుంటారు. కానీ ఓ పిల్లి మాదంటే మాదంటూ ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

 హుజూర్ నగర్ పట్టణానికి చెందిన బానోతు చుక్కమ్మ ఫనిగిరి గట్టు వద్ద ఉన్న మోడల్ కాలనీలో నివాసం ఉంటున్నది. ఆమె మాట్లాడుతూ..ఇటీవల జాతర కు వచ్చిన కొందరు ఈ పిల్ల తమదంటూ గొడవకు దిగారని తెలిపింది. పిల్లిని ఇస్తామని చెప్పినా మొబైల్ పగలగొట్టి తనపై దాడి చేశారని ఆరోపించింది. దీనిపై డయల్ 100 కి కాల్ చేసిన పోలీసులను పిలిచినా వారి మాట కూడా వినకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చానని తెలిపింది. తను రోజు పనికి వెళుతున్న సందర్భంలో అపార్ట్మెంట్ దగ్గర ఓ పిల్లిని కుక్క తరుముతుండగా తీసుకువచ్చి పెంచుకుంటున్నామని తెలిపింది. దీనిపై మద్దెర ముత్యాలు మాట్లాడుతూ..

 మైసూర్ నుంచి పిల్లిని తెచ్చుకుని పెంచుకుంటున్నామని మూడు నెలల క్రితం తప్పిపోయిందని తెలిపారు. ఎలా తీసుకెళ్లారో తెలియదు కానీ మా అన్నయ్య కొడుకుకి కనిపిస్తే వెళ్లి అడగిన ఆ కారణంగా మాపై దాడి చేశారని ఆరోపించారు. దీనిపై ఎస్ఐ ని  వివరణ కోరగా ఆశ్రయించిన మాట నిజమేనని కానీ ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఇది ఏమైనా ఒక పెంపుడు జంతువు కోసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం చాలా ఆనందదాయక విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: