కచ్చా బాదం పై .. విదేశాల్లో స్టెప్స్ చూసారా?
ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయిన బెంగాలీ హిట్ సాంగ్ కచ్చా బాదాం ను మీరు కూడా దాదాపు వినేవుంటారు. ఇలా కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో మందిని ఆకర్షిస్తుంది ఈ పాట. దీంతో ఎంతో మంది ఈ పాట డాన్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఎంతగానో క్రేజ్ సంపాదించిన పాటగా కచ్చా బాదం నిలిచింది. ఇక పోతే ఇప్పుడు ప్రముఖ సోషల్ మీడియా స్టార్ టాంజానియా ఇంస్టాగ్రామర్ కిలి పాల్ ఈ పాట పై డాన్స్ చేసాడు. ఇప్పటికే భారత్ లో వైరల్ గా మారిన ఎన్నో పాటల పై డాన్స్ చేసి అదరగొట్టినా కిలి పాల్ ఇప్పుడు కచ్చా బాదం పాట ని కూడా వదల్లేదు.
తన సోదరి భీమా పాల్ తో కలిసి కచ్చా బాధం పాటకి కాళ్ళు కదిపాడు. ఇక ఈ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 5.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది ఈ పాట. ఇక ఈ వీడియోలో తన సోదరిని నిమా తో కలిసి ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేశాడు కిలి పాల్. ఇక కిలి పాల్ ఎప్పుడు బాగా డాన్స్ చేస్తాడు. ఇక ఈ పాటపై అతని సోదరి కూడా అద్భుతంగా డాన్స్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత అద్భుతంగా ఉంది అంటూ ఎంతో మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ అన్న చెల్లెల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.