వైరల్ : కారుతో వ్యక్తిని ఢీకొట్టి.. కనికరం లేకుండా..?

Purushottham Vinay
దేశ రాజధాని అయిన ఢిల్లీలో మరో దారుణ ఘటన అనేది చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని.. వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆ బాధితుడు పైకి ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు.అయినా కాని ఆ కార్ డ్రైవర్.. ఆ కారును ఆపలేదు.. కారు బానెట్‌పై పాపం ఆ బాధితుడు వేలాడుతున్నా.. ఆ డ్రైవర్ 200 మీటర్ల దూరం పాటు అలానే కారును అలానే నడిపాడు.ఆ తరువాత బాధితుడు కిందపడగానే.. అక్కడి నుంచి సైడ్ తీసుకోని ఆ దుర్మార్గుడు పరారయ్యాడు. ఈ షాకింగ్ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపడం జరిగింది. ఈ ప్రమాదంలో బాధిత వ్యక్తికి చాలా తీవ్రగాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈ ఘటన దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలో  పూర్తిగా రికార్డు అయింది. బాధిత వ్యక్తి ఆనంద్ విజయ్ మండెలియా (37) గా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక దేవుడి దయవల్ల అతని లక్ బాగుండి అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు.


కాగా.. ఈ ఘటనలో 37 ఏళ్ల న్యాయ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో నిందితుడైన రాజ్ సుందరంను హర్యానాలోని గురుగ్రామ్‌లోని లే మెరిడియన్ హోటల్ బయట అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఆ దుర్మార్గుడు అయిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) బెనిటా మేరీ జైకర్ తెలిపారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కారు బానెట్‌ వ్యక్తి ఉన్నప్పటికీ.. ఆ కారు వేగంగా దూసుకెళుతుండటాన్ని మనం ఇక ఈ వీడియోలో చూడొచ్చు. అతను పడిన తరువాత కూడా కారు పక్క నుంచి దూసుకెళ్లడం అనేది ఆ కెమెరాలో రికార్డయింది.ఇక కారు నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెజటిన్లు  మండిపడుతూ పోలీసులను కోరుతున్నారు.https://twitter.com/ieDelhi/status/1492087396573204485?s=20&t=xpU-XiLhOlV1Y9K402dbRA

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: