కోడి చచ్చిపోయిందని ఎక్కిఎక్కి ఏడ్చాడు ఆ వ్యక్తి ... సాధారణంగానే మనుషులకు ఇంకా మూగ జీవాలకు మధ్య ప్రత్యేకమైన అనుబంధం అనేది ఉంటుంది. ముఖ్యంగా సాదు జంతువులతో చాలా మంది మనుషులు ఎంతో ప్రేమగా ఉంటారు.తమ ఇంట్లో పెంచుకునే కుక్క, పిల్లి ఇంకా కోడి, ఇలా ప్రతీ దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటారు. వాటికి ఏమైనా అయితే తట్టుకోలేనంత స్థితిలో వారు ఉంటారు. ఇలాంటి ఘటనలు మనం చాలా సార్లే చూసే ఉన్నాం. తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న సాధు జీవులు కనపడకపోయినా ఇంకా అవి చనిపోయినా బోరున విలపిస్తుంటారు. ఇంకొంత మంది అయితే కొద్దిరోజులు అన్నం తినడం కూడా మానేసిన ఘటనలు చాలానే ఉన్నాయి.కొన్ని సందర్భాల్లో జంతువులు కూడా మనుషుల్లాగే రియాక్ట్ అవుతుంటాయి. తమ ప్రియమైన యజమాని కనిపించకపోయినా లేదా వారి చనిపోయినా వారు తీవ్ర విచారంతో ఉంటాయి.
ఇక పెంపుడు కుక్కలు తమ యజమాని చనిపోతే.. వారి సమాధుల వద్ద రోజుల తరబడి వేచి ఉన్న ఘటనలు కూడా మనం ఇదివరకు చాలానే చూశాం.అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.తన కోడి చనిపోయిందన్న బాధతో ఎక్కిఎక్కి ఏడ్చాడు ఆ కోడి యజమాని. నాలుగేళ్లుగా ప్రేమగా పెంచుకున్న కోడి మృతి చెందడంతో.. అయ్యో నా తల్లి చనిపోయావా అంటూ పడిపడి ఆ వ్యక్తి ఏడ్చాడు. ఇక ఆ వ్యక్తి ఏడ్పును ఆపలేక తంటాలు పడ్డారు అక్కడ స్థానికులు. అంతేకాదు.. తన కోడిని తన ఇంటి ముందే పూడ్చి పెట్టాడు ఆ వ్యక్తి. ఇక ఈ షాకింగ్ ఘటన అనంతపురం జిల్లా నార్పలలోని ఉయ్యాలకుంటలో జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.