భారత్.. చెప్పుల ధర అక్షరాల రూ. 84 వేలు.. ఎక్కడంటే..?
ఇలాంటి అభ్యంతరాలు నడుమ ప్రాడా కంపెనీ తాము తయారు చేస్తున్న డిజైన్ భారత మూలాలకు చెందినవే అని అంగీకరించింది. అంతేకాకుండా మీరు కూడా ఈ బ్రాండ్ పేరుతోనే ఇండియాలో అమ్మకాలు జరుపుకోవచ్చు అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంతో గత గురువారం (డిసెంబర్ 11) రోజున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ చెప్పులను ఫిబ్రవరి 2026 నుంచి అటు ఆన్లైన్లో దొరుకుతాయని, ప్రపంచవ్యాప్తంగా 40 ప్రాడా దుకాణాలలో కూడా అందుబాటులో ఉంటుందట. వీటి ధర 939 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించినట్లు వినిపిస్తోంది. (అంటే ఇండియన్ కరెన్సీ లో రూ. 84,000 రూపాయలు)
అలాగే తామెప్పుడు కళాత్మక నైపుణ్యం ,వారసత్వం, డిజైన్ వంటి సంప్రదాయాలను గౌరవిస్తూనే వచ్చాము ఈ విషయం పైన మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నామని అందుకు సంబంధించి బిబిసికి ప్రతిపాదన కూడా చేశామని తెలిపారు." ప్రాడా మేడ్ ఇన్ ఇండియా ఇన్స్పైర్ బై కొల్హాపురి చెప్పల్స్ " అనే పేరుతో ఉండబోతున్నట్లు తెలియజేశారు. ప్రాడా అవసరాలు డిమాండ్లను సైతం దృష్టిలో పెట్టుకొని మరి వారిని ప్రోత్సహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రత్యేకించి మరి శిక్షణ అందించేలా చేస్తామని తెలిపారు. అలా మహారాష్ట్ర - ఇటలీ మధ్య ఐదేళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంటామని మహారాష్ట్ర మంత్రి సంజయ్ సిర్సాత్ తెలియజేశారు. ఈ చెప్పులను తోలుతో తయారుచేస్తారని దీని మూలాలు 12వ శతాబ్దం నుంచి ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ చెప్పులు భారత్ లోని వేడి వాతావరణానికి సరిగ్గా ఉపయోగపడతాయి.