మహేష్ బాబుకి తమ్ముడి గా ఆ స్టార్ హీరో.. రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ప్లాన్..!?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్ వైపు దృష్టి సారించింది. స్టార్ హీరో మహేష్ బాబును రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్తే అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్‌లో, గ్లోబల్ ఆడియెన్స్‌లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ‘వారణాసి’ సినిమాతో మరోసారి చరిత్ర సృష్టించడానికి రాజమౌళి సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.ఇక ఈ సినిమా విషయంలో తాజాగా వినిపిస్తున్న వార్తలు ఇండస్ట్రీని మరింతగా షేక్ చేస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మాత్రమే కాదు, మరో స్టార్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడన్న సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ్లోబల్ రేంజ్‌లో ఈ సినిమాను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.
అందులో భాగంగానే మహేష్ బాబుకు తమ్ముడి పాత్ర కోసం ఒక బిగ్ బడా స్టార్ హీరోని ఎంపిక చేశారట. ఆ పాత్ర స్క్రీన్ టైమ్ పరంగా పెద్దది కాకపోయినా, కథలో చాలా కీలకమైనదిగా ఉండబోతుందట. ముఖ్యంగా రాజమౌళి మీద ఉన్న గౌరవం, ఆయన విజన్‌పై నమ్మకంతో ఆ స్టార్ హీరో వెంటనే ఓకే చెప్పేశాడన్న వార్త అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఆ స్టార్ హీరో మరెవరో కాదు… బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్. ‘అనిమల్’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రణ్‌బీర్ కపూర్‌ను, మహేష్ బాబుకు తమ్ముడి పాత్రలో రాజమౌళి చూపించబోతున్నారట. ఈ న్యూస్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ సర్ప్రైజ్ అవుతున్నారు. తెలుగు–హిందీ ఇండస్ట్రీల మధ్య ఈ కాంబినేషన్ నిజమైతే, అది పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు, గ్లోబల్ లెవెల్‌లో కూడా భారీ ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ ప్లానింగ్ అంతా రాజమౌళి మాస్టర్ మైండ్‌కు మరో ఉదాహరణ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కథ పరంగా, క్యారెక్టర్ల పరంగా ఆయన ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తాడని, ఈసారి కూడా అదే విధంగా ‘వారణాసి’ సినిమాతో ఆడియెన్స్‌ను సర్ప్రైజ్ చేయబోతున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. రాజమౌళి ఏ ఉద్దేశంతో రణ్‌బీర్ కపూర్‌ను ఈ పాత్రకు ఎంపిక చేశాడో అధికారికంగా ఇంకా తెలియకపోయినా, ఈ వార్త మాత్రం ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తోంది. నిజంగా ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే, ‘వారణాసి’ సినిమా విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఈ ఒక్క వార్తే ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.