సెకండ్ డోస్ వేసుకునే వ్యక్తులు తప్పిపోయారట..!

MOHAN BABU
మొదట్లో కరోనా పీక వేసుకోవడానికి చాలా భయపడ్డారు. తర్వాత వచ్చిన వేవ్ తో చాలామంది వైరస్ బారిన పడి  టీకాల కోసం పరుగెత్తారు. మొదటి డోసు వేసుకున్నారు. ఆ తర్వాత డోస్ నుంచి వారు కనిపించడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ డోస్ బాధితులు దొరకడం లేదు  రెండో రోజు పొందాల్సిన వారిలో 87 శాతం మంది టీకాలు వేసుకోగా,మరో 13 శాతం మందికి పూర్తికాలేదు. గడువు ముగిసిన స దరు వ్యక్తులు ఇప్పటివరకు డోసులు వేసుకోకపోవడం గమనార్హం. వీరి కోసం వైద్య సిబ్బంది జల్లెడ పడుతున్నది. క్షేత్ర స్థాయిలో తిరుగుతున్న దొరకడం లేదంటూ ఆశాలు, ఏఎన్ఎంలు వాపోతున్నారు. తప్పుడు అడ్రస్ లు,ఫోన్ నెంబర్లు ఇవ్వడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో చాలా టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఈ క్రమంలో చాలామంది ఇబ్బంది పడ్డారు.


 పట్టణాల్లోనే ఈ సమస్య వేధిస్తుంది.కరీంనగర్, హన్మకొండ జిల్లాలో రెండు డోసుల్లో 100% పంపిణీ పూర్తి కాగా,హైదరాబాద్ లో ఇప్పటివరకు కేవలం 80 శాతం మంది మాత్రమే రెండో డోసు పొందారు. ఇక యాదాద్రి, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి,జనగామ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల సిద్దిపేట,జగిత్యాల,నల్లగొండ,మంచిర్యాల జిల్లాలో సగటున 90 శాతం చొప్పున పూర్తి కాగా, మహబూబ్ నగర్, భద్రాద్రి, భూపాలపల్లి,వరంగల్, సూర్యాపేట్,నిర్మల్, నాగర్ కర్నూల్,సంగారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్ జిల్లాలో సగటున 85 శాతం చొప్పున రెండో డోసు పూర్తయింది. వనపర్తి,


 వికారాబాద్, కొమురం భీం జిల్లాలో రెండో డోసు పంపిణి వెనకబడింది.రాష్ట్రవ్యాప్తంగా టీనేజర్ల టీకా పంపిణీ స్పీడ్ గా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏకంగా 72 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తయింది. హన్మకొండ లో 100% పూర్తిగా మహబూబ్ నగర్, ఖమ్మం, నారాయణపేట్,వనపర్తి, సిరిసిల్ల, సంగారెడ్డి, కొత్తగూడెం, గద్వాల జిల్లాలో సగటున 90 శాతం చొప్పున వ్యాక్సినేషన్ జరిగింది.అతి తక్కువగా రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 51 శాతం మంది మాత్రమే టీకా పొందడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: