4 చేతులు, 4 కాళ్లతో పుట్టిన శిశువు.. దేవుడి అవతారామంటున్న ప్రజలు..!

MOHAN BABU
 ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ ఎంత పెరిగినా మూఢనమ్మకాలు అనేవి మనుషుల మెదళ్ళలో పాతుకొని పోయాయి. సైన్సుని కూడా అపహాస్యం చేసి మూఢనమ్మకాల గొప్పవని చాటిచెప్పే వారు కూడా సమాజంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక శిశువు నాలుగు కాళ్ళు మరియు నాలుగు చేతులతో జన్మించాడు. శిశువు తల్లి గర్భం దాల్చిన అప్పటినుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళుతూనే ఉంది. అయితే 9 నెలలు నిండిన తర్వాత స్కానింగ్ లో కూడా శిశువు నార్మల్ గానే ఉందని వైద్యులు తెలిపారు. అనుకున్న సమయానికి ప్రసవం కోసమే ఆమె దావకానలో చేరింది. సహజంగా ప్రసవం సాధ్యం కాకపోవడంతో వైద్యులు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. దీంతో వైద్యులు షాక్ అయ్యారు.

పుట్టిన శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు వింతగా ఉండడంతో  వారి కుటుంబీకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు జరిగిందని వైద్యులతో గొడవ కూడా దిగారు. ఈ వింత సంఘటన బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో చోటుచేసుకున్నది. ముఫాసిల్  పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్లాగంజ్ గ్రామానికి చెందినటువంటి రాజు సాహూ దంపతులకు ఈ శిశువు జన్మించింది. భార్య గర్భం దాల్చినప్పుడు వారు కతిహార్ పట్టణంలోని సదార్ దవాఖానాలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమెకు పూర్తిగా నెలలు నిండటంతో ఆపరేషన్ చేయగా, వారికి వింత శిశువు జన్మించింది. దీంతో ఆ గ్రామస్తులంతా పుట్టిన శిశువును భగవంతుడి అవతారంగా భావించి, ఆస్పత్రికి చేరుకొని  దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. రాజు కుటుంబ సభ్యులు మాత్రం శిశువు ఇలా ఎందుకు జన్మించిందని వైద్య సిబ్బందిని నిలదీశారు. గతంలో ఎప్పుడూ స్కానింగ్ తీసిన  ఈ విషయం ఎందుకు చెప్పలేదని వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఎప్పుడు అడిగినా శిశువు ఆరోగ్యంగానే ఉందని చెప్పారని, ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం కాస్త పోలీసుల దాకా వెళ్లడంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు శిశువు కుటుంబీకులకు సర్ది చెప్పారు. దీంతో మరోసారి డాక్టర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రాజు భార్యకు పుట్టినది వింత శిశువు కాదని, వీరిని దివ్యాంగులుగా పిలుస్తారని ఆసుపత్రి వైద్యులు  తెలియజేసారు. తల్లి గర్భంలో 2 పిండాలు  సరిగా అభివృద్ధి చెందకపోవడంతో ఇలా జరిగిందని,  ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని రాబోయే రోజుల్లో శిశువు ఆరోగ్యానికి ముప్పు రావచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: