మామూలోడు కాదు.. హామీ ఇచ్చాకే హస్తం గూటికొచ్చాడు?

praveen
నేటి తరం రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఒక పార్టీ తరపున టికెట్ దక్కలేదంటే ఇక అక్కున చేర్చుకున్న పార్టీని నిర్మొహమాటంగా వదిలేసి అప్పటివరకు తిట్టిన పార్టీలోకి వెళ్లడం నేటి రోజుల్లో సరికొత్త ట్రెండ్ గా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇలా జంపింగ్ జిలానీల వ్యవహారం తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది. రెండుసార్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఆ పార్టీలోని కీలక నేతలందరూ కూడా కారు దిగి హస్తం గూటికి
 చేరుకుంటున్నారు.

 ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా కారు పార్టీని వీడారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన వారిలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న రంజిత్ రెడ్డి కూడా ఒకరు. 2004 నుంచి ఆయన గులాబీ పార్టీతోనే ఉన్నారు. ఏకంగా టిఆర్ఎస్ పార్టీలో చేరి మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇక తర్వాత 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డారు.

 ప్రత్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పై 14 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఇలా సెట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డికి ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఛాన్స్ రాలేదు. ఏకంగా బీసీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ ను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ ప్రకటన చేసింది. ఇంకేముంది పోరాడితే పోయేదేమీ లేదు అంటూ సోషల్ మీడియాలో రంజిత్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టారు. దీంతో పార్టీ మారబోతున్నారు అన్న విషయంపై చర్చ మొదలైంది. ఇలాంటి చర్చ మొదలైందో లేదో అంతలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే టికెట్ ఇవ్వలేదని కోపంతో పార్టీ మారిన నేతలు చాలామంది ఉంటారు. కానీ రంజిత్ రెడ్డి అలా కాదు ఒక హస్తం పార్టీ నుంచి పక్క హామీ వచ్చిన తర్వాతే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు  ఇక ఇప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే తనను పక్కన పెట్టిలో ఇక ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లి ఎంపీ టికెట్ దక్కించుకొని అదే బిఆర్ఎస్ ను ఓడించేందుకు రెడీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: