అద్భుతం సృష్టించిన కరోనా టీకా.. మూగ వ్యక్తికి మాటలు..!

MOHAN BABU
 దేశవ్యాప్తంగా కరోణ వ్యాక్సినేషన్ ప్రారంభమై సంవత్సరం పూర్తయింది. ఇప్పటికే 150 కోట్లకు పైగా డోసులను వేశారు. అయినా కొందరిలో మాత్రం టీకాలపై సందేహాలు  పోవడం లేదు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడే టీకాలు కూడా వేయించుకోవడం లేదు. కానీ జార్ఖండ్లో  అద్భుతం జరిగింది. పక్షవాతంతో మంచంలో పడి ఉన్న ఒక వ్యక్తిలో  కరోనా టీకా వేయడంతో కదలికల వచ్చాయి. అలాగే మూగబోయినటువంటి ఆ వ్యక్తికి గొంతు మళ్లీ వచ్చి మాటలు కూడా వస్తున్నాయి. ఈ టీకా వేసుకున్న తర్వాత అతను మాట్లాడుతున్నాడు అంటే అతిశయోక్తి లేదు. దీన్ని చూసిన డాక్టర్లు సైతం షాక్ అయ్యారు.

 పూర్తి వివరాలకు వెళ్తే బుక్ కోర జిల్లాలోని పెటల్ వార్ మండలం సల్గాడి గ్రామానికి చెందినటువంటి 55 ఏళ్ల దులార్ చందు  ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తల మరియు వెన్నెముకపు సర్జరీ చేసి అతని ప్రాణాలను డాక్టర్లు కాపాడారు. కొన్ని నెలల తర్వాత  ఆయన కోలుకున్నాడు. కానీ అతని శరీరంలోని కొన్ని అవయవాలు పని చేయడం లేదు. మాట కూడా పడిపోయింది. పక్షవాతం కారణంగా కాళ్లు చేతులు కూడా పడిపోయాయి. ఎటూ కదలలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమై నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే దులార్ చందు ఇంటికి వచ్చి అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బందితో వ్యాక్సినేషన్ వేయించారు. అతను కోవిషిల్డ్  తీసుకున్నా మరుసటి రోజు మాట్లాడడం, శరీరంలోని కాళ్లలో  కదలికలు రావడం, మొదలయ్యాయి. దీంతో అందరూ షాక్ అయ్యారు. వారి కుటుంబ సభ్యులు మాత్రం ఎంతో ఆనంద పడ్డారు. వెంటనే గ్రామ పంచాయత్ సర్పంచ్ సుమిత్రాదేవి ఈ విషయాన్ని బయట తెలియజేసింది.

జనవరి 4వ దులార్ చందుకు అంగన్వాడి కేంద్ర సిబ్బంది తమ ఇంటి వద్ద వ్యాక్సిన్ వేశారని, మరుసటి రోజు నుంచి అతని శరీరంలో మార్పులు వచ్చాయి అని,  చచ్చుబడిన కాళ్ళలో సైతం  కదలికలు మొదలయ్యాయి అని అందరిలాగే అతను మాట్లాడుతున్నాడని ఆమె వివరించింది. దీనిపై స్పందించిన డాక్టర్లు  అతనిపై అధ్యయనం చేయాలని, ఇది చాలా ఆశ్చర్య కరమైన  విషయమని సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర తెలియజేశారు. ఏది ఏమైనా కరోణ వ్యాక్సినేషన్ దులార్ చందు  కుటుంబంలో కొత్త వెలుగులు నింపిందని గ్రామస్తులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: