వైరల్ : ఇదేం పిచ్చి.. నేరస్థుడికి లిప్ లాక్ ఇచ్చిన మహిళ న్యాయమూర్తి?

praveen
ప్రేమ ఎప్పుడూ ఎవరి మధ్య ఎలా పుడుతుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. రెండు అక్షరాల ప్రేమ క్షణ కాలంలో పుట్టి రెండు జీవితాలను పెనవేస్తూ ఉంటుంది. అయితే ఇలా ప్రేమ పుట్టడం సహజం. కానీ అందరి ప్రేమను విజయవంతంగా ముగుస్తాయి  అని మాత్రం చెప్పలేము. కొంతమంది ప్రేమకు మధ్యలోనే బ్రేక్ పడుతూ ఉంటుంది. అయితే సాధారణంగా స్నేహితులు క్లాస్మేట్స్ సహోద్యోగులు ప్రేమలు పడుతూ  ఉంటారు. ఒకరి భావాలు ఒకరికి నచ్చి చివరికి పరిచయం కాస్త ప్రేమగా మారి పోతూ ఉండటం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ కని విని ఎరుగని విచిత్రమైన ప్రేమ కథ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఆమె ఒక న్యాయమూర్తి.. కాని ఆమెకు ఒక నేరస్థుడు మీద ప్రేమ కలిగింది. వినడానికి కాస్త విచిత్రంగా  ఉన్నప్పటికీ ఇది నిజంగానే జరిగింది. మహిళ హత్య  కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి తో ఏకంగా న్యాయమూర్తి ప్రేమలో పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దక్షిణ ప్రావిన్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా న్యాయమూర్తి నిందితుడుతో జైల్లో రొమాన్స్ చేసిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. చుట్టూ అందరూ ఉన్నారు అని కూడా పట్టించుకోకుండా ఏకంగా జైల్లోనే ఒకరికొకరు లిప్ లాక్ పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అర్జెంటీనాలో డిసెంబర్ 29వ తేదీన ఈ ఘటన జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం.ది మహిళ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న క్రిస్టియన్ బస్టాన్ అనే ఖైదీని న్యాయమూర్తి మారియల్ సువరేజ్ ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

 మహిళ హత్య కేసులో నేరం నిరూపణ కావడంతో సదరు ఖైదీకి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే కొందరు న్యాయమూర్తులు ఖైదీ కి వ్యతిరేకంగా మాట్లాడితే కేవలం సదరు మహిళ మాత్రమే ఖైదీ కి అనుకూలంగా ఓటు వేసింది. పాపం ఆ ఖైదీ పై మహిళా న్యాయమూర్తి కి ఎప్పుడు ఎలా ప్రేమ పుట్టిందో ఏమో. అతన్ని కాపాడుకోవాలి అనుకుని ఎంతగానో ప్రయత్నించింది. కానీ కుదరలేదు చివరికి ఇలా ఏకంగా జైల్లోనే లిప్ లాక్ పెట్టి రొమాన్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: