వామ్మో.. గంగిరెద్ధుకు ఇంత టెక్నాలజీ వాడుతున్నారా?

Satvika
కరోనా ఏమని వచ్చిందో కానీ జనాల స్థితి గతులు పూర్తిగా మారిపోయాయి. చేతికి డబ్బులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు అడగలేదు.. కష్టమర్స్ ఇవ్వడం లేదు. పది రూపాయల పానిపూరి తినాలని అన్నా కూడా డిజిటల్ పేమెంట్ చెస్తున్నారు.. అంతగా టెక్నాలజీని వాడుతున్నారు.. జనాలు జేబులో డబ్బులు పెట్టుకోవడం మానేశారు. ఇప్పుడంతా ఆన్ లైన్ పేమెంట్సే. స్మార్ట్‌ ఫోన్‌ చేతి లో ఉంటే సెకన్ల వ్యవధిలో లావాదేవీలు కంప్లీట్ చేయవచ్చు.

క్యూఅర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి డబ్బులు పంపించటం చాలా ఈజీ. అదీకాక కరోనా నేపథ్యం లో ఇప్పుడు జనాలు లిక్విడ్ క్యాష్ క్యారీ చేయడం మానేశారు. రూ.10 పెట్టి టీ కొన్నా కూడా గూగుల్‌ పే, ఫోన్‌ పే క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. పెద్ద పెద్ద నగరాల్లొనె కాదు మారు మూల గ్రామీన ప్రాంతాల్లొ కూడా అలానే లావా దేవీలు చెస్తున్నారు. కాగా ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ రేంజ్ పీక్ కి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంగిరెద్దుల వాళ్లు తమ పాత ఎద్దులను అలంకరించి పండగల సమయాల్లో ఇంటింటి కీ తిరిగి నాదస్వరం ఊదుతూ భిక్షాటన చేస్తుంటారు.

అయితే ముందు రోజుల్లో ఐదో, పదో ఇస్తే వెళ్ళే వాళ్ళు. ప్రస్తుతం గంగిరెద్దులును ఆడించుకుంటూ వచ్చే బసవన్నలు కూడా డిజిటల్‌ పద్దతి లోనే భిక్షాటన చేస్తున్నారు. నిజమండీ.. ఏపీ లోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు ఇవే సీన్స్ కనిపిస్తున్నాయి. గంగిరెద్దు ముక్కుతాడుకు క్యూ ఆర్ కోడ్ పెట్టి సంక్రాంతి చందాలు తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలా చేయడం ద్వారా ఒకవైపు కరోనా నుంచి రక్షణ పొందవచ్చు, మరోవైపు డిజిటైజేషన్‌ ను ప్రొత్సహించినట్లు అవుతుంది అంటూ సోషల్ మీడియాలొ తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: