వామ్మో ...రబ్బరుతో చోరి..వీడి తెలివికి హ్యాట్సాప్..

Satvika
దొంగతనం చేసెందుకు ఇప్పుడు దొంగలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. వారి తెలివి ముందు పోలీసుల సెక్షన్స్ తక్కువే..ఇప్పుడు ఒక దొంగ తెలివికి మనం ఒక లైక్ వేసుకొవాల్సిందె.. అంత మాస్టర్ మైండ్ తో దొంగతనం చేశాడు. అతని ప్లాను పోలీసులు పసి గట్టారు.అతడికి ఒక్క రబ్బరు బ్యాండ్‌ ఉంటే చాలు.. అదే అతడి ఆయుధం. ఊర్లలో పిట్టలను కొట్టే వారి తరహాలో ఇతను హెయిర్ పిన్‌కి రబ్బర్ బ్యాండ్‌ కట్టి, దానికి ఓ చాక్లెట్ కవరును కడుతున్నాడు.

ఆ కవరు మధ్యలో చిన్న రాయిని పెడుతున్నాడు. రాయిని లాగి… కారు అద్దంవైపు గురిపెడుతున్నాడు. వేగంగా దూసుకెళ్లే రాయి… కారు అద్దాన్ని పగలగొడుతోంది. వెంటనే తన పనికానిచ్చేస్తున్నాడు. అంత ఈజీగా ఇతను చోరీలు చేస్తున్నాడు. ఇలా చేసినప్పుడు అద్దం పగిలిన శబ్దం పెద్దగా రాకపోవడం తో ఎవరికీ ఆ విషయం తెలియదు. అందుకే ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాడు.. మొత్తానికి పోలీసుల పంజాతో చిక్కాడు.. దొంగను దర్యాప్తు చేసిన పోలీసులు అతను చోరీలకు పాల్పడుతున్న విధానం గురించి విని నమ్మలేదు.

అయితే అతను పోలీసులు ఎదురుగానే రబ్బర్ బ్యాండ్‌తో కార్ల అద్దాలు పగలగొట్టి చూపించాడు.అతను దొంగతనం చేస్తున్న వీడియోను ఒక పోలీసు అధికారి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు..పార్క్ చేసిన కార్లలో విలువైన వస్తువులు ఉంచకండి. వాళ్లు రబ్బర్ బ్యాండ్‌తో గ్లాస్ పగలగొట్టగలరు. తమిళనాడులో ఇది జరిగింది' అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చెయ్యడానికే పోలీసులు ఈ విషయాన్ని మీడియా మందుంచారు. సో… కార్ పార్క్ చేసి.. లాక్ వేసినంత మాత్రాన అది సేఫ్‌గా ఉంటుందనీ, అందులోని వస్తువులు సురక్షితంగా ఉంటాయని గ్యారంటీ లేదు. అందుకే ఎంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది.. ఇలాంటి దొంగలు కూడా ఉంటారని హెచ్చరిస్తున్నారు... ఆ వీడియోను మీరు చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: