Viral Video : కప్ప కడుపులో వెలుగుతున్న లైట్..

Purushottham Vinay
ఇక చిన్న పిల్లలు తమ చేతికి అందిన వస్తువులను తింటుండటం మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అందుకని వారిని భయపెట్టేందుకు పెద్ద వారు కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు అంటుంటారు.ఇక బియ్యం తింటే పెళ్లి సమయంలో వర్షం వస్తుందని ఇంకా ఏవైనా కాయలు తింటే కడుపులో మొలకలు వస్తాయంటూ పెద్దలు రకరకాల మాటలు చెబుతుంటారు. అదంతా కూడా ట్రాష్ అని అందరికీ తెలుసు. ఇక అది వేరే విషయం అనుకోండి. అయితే, ఇక ఇక్కడ మనం ఓ కప్ప గురించి చర్చించుకోబోతున్నాము. ఆ కప్ప మామూలు కప్ప కాదు.. దాని కడుపులో లైట్ మిల మిల అని మెరుస్తోంది. మరి ఆ కప్ప ఏంటి దాని కడుపులో లైట్ ఏంటో ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.జంతువులకు సంబందించిన వీడియోలు ఇంకా అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
 తాజాగా ఓ కప్పకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇంట్లోని గోడను పట్టుకుని పాకుతున్న ఓ కప్ప కడుపులో లైట్ మిణుకు మిణుకుమంటూ మెరుస్తుంది.ఇంతకీ దాని కడుపులోకి ఆ లైట్ ఎలా వెళ్లిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఇక సాధారణంగా కప్పలు చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తింటూ ఉంటాయి. మినుగురు పురుగులు ఇంకా చిన్న చిన్న పరుగులను గుటుక్కున మింగేస్తుంటాయి. అయితే, ఇంట్లోకి వచ్చిన ఈ కప్ప ఎదుట మిణకు మిణుకు మంటూ చిన్నసైజ్ లైట్ అనేది మెరుస్తూ కనిపించింది. ఇక దానిని చూసి ఏదో జీవి అనుకున్న కప్ప ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిని గబాలున మింగేసింది. అది గమనించిన ఇంట్లోని వ్యక్తులు ఇక ఆ కప్పను కాసేపు పరిశీలించారు.
 కప్ప ఆ లైట్‌ను మింగినప్పటికీ.. అది ఇంకా పని చేస్తూనే ఉంది. ఇక కప్ప కడుపులోకి వెళ్లిన ఆ లైట్ వెలుగుతోంది. దీనిని వీడియో తీసిన ఇంట్లోని వ్యక్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. ఇక ఆ వీడియోను చూసి నెటిజన్లు దెబ్బకు షాక్ అవుతున్నారు.ఇక ఇప్పటి వరకు కూడా ఈ వీడియోను 3 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించగా...ఇంకా వేలాది లైక్స్ వచ్చాయి. ఇక ఆ కప్ప కడుపులో లైట్ వెలగడాన్ని చూసి నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కప్ప గ్రహాంతర జీవి అయ్యిండొచ్చని కూడా వారు పేర్కొంటున్నారు.

https://twitter.com/gunsnrosesgirl3/status/1475211045371326475?t=Dyb2xoI0_cq-4oVt0e1gMQ&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: