వామ్మో: ఏపీలో ఓమిక్రాన్ విలయతాండవం..ఒకే రోజు..?

Divya
కరోనా ప్రభావం కాస్త తగ్గింది అనుకునే లోపు.. ఇప్పుడు తాజాగా మరొక కొత్త వేరియంట్ దేశమంతటా వ్యాపిస్తోంది. ఇక ఇదే నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రదేశాలలో సరికొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి.దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో..ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కు చేరింది.
అయితే తాజాగా ఈ రోజున భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 781 చేరింది. దేశంలో ఉండేటువంటి 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 241 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ వారు ఈ రోజున ఉదయం తెలియజేసినట్లు సమాచారం. ఇక ముఖ్యంగా ఢిల్లీ వంటి పరిసరాలలో 238 మంది ఈ వైరస్ బారిన పడి నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర లో  అయితే ఏకంగా 161 మంది ఈ వైరస్ బారిన పడడంతో ఇది రెండవ స్థానంలో ఉన్నది. ఇక అంతే కాకుండా ఒక వైపు కరోనా కూడా మరింత తీవ్రంగా పెరుగుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. గడిచిన ఈ ఒక్క రోజులోనే సరికొత్తగా 9,195 కరోనా కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య. 3,48,08,886 గా వైద్య శాఖ వారు తెలియజేశారు.
.
ఇక అంతే కాకుండా కేవలం నిన్న ఒక్కరోజు మాత్రమే కరోనా బారిన పడిన వారిలో 302 మంది మృతి చెందినట్లుగా సమాచారం. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య..4,80,592 కీ చేరిపోయింది. గడిచిన ఈ రోజు ..7,347 మంది ఈ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.అయితే ఇప్పటివరకు కోలుకున్న వారు మొత్తం 3,42,51,291 అట. అందువల్లనే దేశవ్యాప్తంగా వాక్సినేషన్ చాలా వేగంగా కొనసాగించడం జరుగుతోంది.. కేవలం నిన్న ఒక్కరోజే 64,61,320 మందికి డోసులు పంపించినట్లు గా సమాచారం. మరింత వేగంగా  డోసులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: