ఇంట్లో సంతోషంగా వుండాలంటే..ఈ వాస్తు చిట్కాలు తప్పనిసరి..!!

Divya
ఎవరైనా సరే తమ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. అంతేకాదు జీవితంలో సంతోషంగా గడపాలి.. కుటుంబ సభ్యులతో ప్రతి విషయం పంచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఏవో తెలియని కారణాల వల్ల కుటుంబాలకు దూరంగా ఉంటూ అనవసరంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడుతూ ఉంటారు.. అవన్నీ పక్కన పెడితే చాలా మంది కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించడానికి కష్టపడి పనులు చేసుకుంటూ డబ్బులు కూడా పోగు చేసుకుంటూ ఉంటారు..

ఇక ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కుటుంబ సభ్యులతో సంతోషంగా లేకపోవడం బాధాకరం గా కనిపిస్తూ ఉంటుంది అయితే అన్నింటికీ కారణం  వాస్తే అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనం ఇంట్లో సంతోషంగా ఉండాలి కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలి అంటే వాస్తు శాస్త్రం తప్పనిసరి అని వారు చెబుతున్నారు..  ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే మన ఇంటికి ఉండే ప్రధాన ద్వారం చాలా ముఖ్యం. ఇక ప్రధాన ద్వారానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తును ఉంచడం వల్ల ఇంటికి శుభం కలగడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ కూడా ప్రవేశిస్తుందట.. ఇక  పూజగది ఉత్తరానికి లేదా తూర్పు దిశ వైపు వుండేలా చూసుకోవాలి.
అంతేకాదు ఇంటి ఆవరణ పెరటిలో ముళ్ళు కలిగిన మొక్కను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచుకోకూడదు. ఎవరైనా సరే మరణిస్తే వారి ఫోటోలను పూజ గదిలో కూడా ఉంచకూడదు. చాలామంది ఇంటికి మెట్లను నిర్మించిన తర్వాత మెట్ల కింద భాగంలో పడుకోవడానికి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఇలా మెట్ల కింద పడకగదిని ఏర్పాటు చేయడం వల్ల లేనిపోని దరిద్రం అంటుకుంటుంది. ఇక చెట్లు పెంచేటప్పుడు మోకాలి కింది భాగం వరకు పెరిగే మొక్కలను మాత్రమే ఇంటి ఆవరణంలో పెంచుకోవాలి. పాలు కారే మొక్కల్ని కూడా ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు. అంటే వాస్తు చిట్కాలను పాటిస్తే తప్పకుండా శుభ పరిణామాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: