కరెంట్ షాక్ తగిలినప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి..!

Divya
కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది..అయితే ఎవరికైనా ఒక వ్యక్తికి కరెంట్ షాక్ కొట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి చదువు తెలుసుకుందాం..

1. కరెంట్ షాక్ కి గురైన వ్యక్తిని ఎలక్ట్రిక్ ఫ్లో అవుతున్న వైరు నుంచి వెంటనే తొలగించాలి.
2. కరెంట్ షాక్ కి గురైన వ్యక్తి స్రృహ కోల్పోకుండా
 ఉన్నట్లయితే అతడు భయపడకుండా కావాల్సిన ధైర్యాన్ని అందించాలి.
3. అనుకోనివేళ పేషెంట్‌ కనుక అపస్మారక స్థితిలోకి వెల్లినట్లయితే ముందుగా ఆ వ్యక్తి యొక్క  పల్స్‌ చూడాలి. ఒకవేళ పల్స్‌ అందకపోతే సీపీఆర్‌ చేయించాలి.. అంటే.. ఆ వ్యక్తికి శ్వాస ఆగిపోతే..మన  నోటి ద్వారా వారికి కాస్త ఒత్తిడితో కూడిన గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపాలి.
4. ఒకవేళ కరెంట్ షాక్ కి గురైన వ్యక్తి యొక్క గుండె స్పందనలు ఆగిపోతే.. కనీసం రెండు అంగుళాల లోతుగా అతనిపై  ప్రభావం పడేట్లుగా ఛాతీపైన చేతులు ఉంచి గట్టిగా  ప్రెషర్‌ ఇవ్వాలి. ఈ రెండూ చేస్తూ దగ్గర్లోని ఆసుపత్రికి వెంటనే  తరలించాలి.
5. ఎలక్ట్రిక్‌ షాక్‌ వల్ల శరీరంపై గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాదు ఒక్కోసారి చర్మం కాలిపోతుంది కూడా.. అలాంటి ప్రదేశాలను ఎలక్ట్రిక్‌ బర్న్‌ అంటారు. వాటికి ఆయింట్‌మెంట్స్‌ గానీ, బర్న్ ఆయిల్ గానీ,  పూతమందులు గాని పూయకూడదు.
6. కరెంట్ షాక్ కొట్టిన వారు పైనుంచి కింద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలాంటి వారిని ఆకస్మాత్తుగా కదిలించకూడదు. వారి పరిస్థితిని బట్టి ప్రధమ చికిత్స చేయడం ఎంతో అవసరం.
7. వీరి గుండె స్పందనల్లో తేడా కూడా రావచ్చు. దానిని వెంట్రిక్యులార్‌ అరిథ్మియా అంటారు.దీనిని మానిటర్‌ ద్వారానే గుర్తించగలం కాబట్టి.. వెంటనే దగ్గరలో వున్న ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తే.. ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడతారు.కరెంట్ షాక్ తగిలిన వ్యక్తిని మనం ఈ విధంగా కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: