రోడ్డుపై చాట్ అమ్ముకుంటున్న కేజ్రీవాల్.. కానీ అసలు ట్విస్ట్?

praveen
సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అనేది ఒక నానుడి ఉంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. అచ్చంగా ఒక ప్రాంతంలో ఉన్న వ్యక్తి పోలికలతోనే ఇంకా ఎక్కడో మరో ప్రాంతంలో ఉన్న వ్యక్తి  ఉండడం లాంటివి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయ్. ఇక ఇటీవల సోషల్ మీడియా వాడకం రోజురోజుకూ పెరిగిపోవడంతో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూ ఉండడం గమనార్హం.  సాధారణంగా కామన్ మాన్ లాగా మరో కామన్ మ్యాన్ ఉంటే అంతల ఎవరూ పట్టించుకోరు.

 కానీ ఒక రాజకీయ ప్రముఖుడో లేక సినీ ప్రముఖుడి లాగా మరొకరు ఉన్నారు అంటే చాలు ఇక అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.  అందరూ దీని గురించే చర్చించుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.  దాదాపుగా అందరికీ దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించి తెలిసే ఉంటుంది.  ఆయన ఎలా ఉంటాడో కూడా అందరికీ తెలుసు. ఇక్కడ వీడియోలో చూస్తే మాత్రం అదేంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రోడ్డుమీద చాట్ అమ్ముకుంటున్నాడు.

 ఆయనకు అంత దుస్థితి వచ్చిందా అని అవాక్కవుతారు ఎవరైనా. అయితే ఇక్కడ వీడియోలో మీరు చూసేది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని కాదు అచ్చంగా ఆయన పోలికలతోనే ఉన్న ఒక కామన్ మ్యాన్ ను. ఇటీవలే అరవింద్ కేజ్రీవాల్ పోలికలతో ఉన్న కామన్ మాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అచ్చం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లాగా ఉన్న ఆ వ్యక్తి మధ్యప్రదేశ్ గ్వాలియర్  ఓ బైక్పై చాట్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్ వీడియోతో అతడు బాగా ఫేమస్ గా మారిపోయాడు.  తనను చూసిన వాళ్లందరూ కేజ్రీవాల్ లాగా  ఉన్నావ్ అని అంటూ ఉంటారు. ఇక చలికాలంలో మప్లర్ ధరించిన సమయంలో కేజ్రీవాల్ కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెబుతూ ఉంటారు అని చెబుతున్నాడు కేజ్రీవాల్ పోలికలతో ఉన్న కామన్ మ్యాన్ గుప్తా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: