ఫైన్ కట్టమని చెప్పినందుకు ట్రాఫిక్ పోలీస్ కి చుక్కలు చూపించిన డ్రైవర్ బాబు

Surya
 ముంబై నగరంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. 
రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన డ్రైవర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరింత ఇరకాటంలో పడిన సంఘటన ముంబైలోని పశ్చిమ అందేరి లో చోటు చేసుకుంది. అంధేరీలోని మెట్రో స్టేషన్ క్రింద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విజయ్ సింగ్ గురవ్ కు రాంగ్ సైడ్ నుంచి లోపలికి తీసుకు వచ్చి ఎస్ వి రోడ్డు వైపు వెళ్తున్న వాహనాన్ని గమనించాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారు ఆపవలసిందిగా విజయ్ సింగ్ గురవ్ కోరినప్పటికీ ఏదో గుర్తింపు ఉన్న లైసెన్స్ను చూపించి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడని గురవ్ తెలియజేశాడు.


 రాంగ్ రూట్ డ్రైవర్ కారు ఆపే ప్రయత్నం చేయకపోగా దురుసుగా ప్రవర్తిస్తూ ఉండడంతో గురవ్ కారు యొక్క బానెట్ పై కూర్చోవడం జరిగింది. . రాంగ్ రూట్ లో వచ్చినందుకు డ్రైవర్ పై గురవ్ కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు గుమికూడటం తో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం లో భాగంగా విజయ్ సింగ్ గురవ్ ను కారు బానెట్ పై ఉండగానే కిలోమీటర్ దూరం వరకు స్పీడ్ గా తీసుకు వెళ్లడం జరిగింది. 


ఈ మొత్తం ఘటనను చుట్టుపక్కల వాళ్ళు తమ చరవాణి లతో సన్నివేశాన్ని చిత్రీకరించడం జరిగింది. డ్రైవర్ కిలోమీటర్ తర్వాత కారుని ఆపి లొంగి పోయాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కొందరు రాంగ్ రూట్ లో వచ్చిన డ్రైవర్ ను తప్పు పడుతూ ఉంటే కొందరు కారు బానెట్ పై కూర్చున్న ట్రాఫిక్ పోలీస్ తీరును తప్పు పడుతున్నారు. రాంగ్ రూట్ లో వచ్చిన డ్రైవర్ పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 353 , సెక్షన్ సెక్షన్ 279 ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: