వైరల్ : తల్లిదండ్రులు బంగారం ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న యువతి..!

Divya
పరిస్థితులు రోజురోజుకు ఎలా అవుతున్నాయి అంటే మానవత్వం కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది..ఎంతలా అంటే బంగారం కోసం 21 సంవత్సరాల యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వార్త కాస్త నెట్టింట సంచలనంగా మారింది.. అయితే 21 సంవత్సరాల వయసు కలిగిన ఈ యువతి బంగారం కోసం ఎందుకు మరణించింది.. అసలు కథ ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి వివరాల్లోకి వెళితే , వికారాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. జిల్లాలోని అనంతగిరి పల్లి కి చెందిన 21 సంవత్సరాల వయసు కలిగిన మమత అనే అమ్మాయి.. అదే గ్రామానికి చెందిన నవీన్ ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెద్దల సమక్షంలో ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు.. పెళ్లి అనగానే తండ్రి తరఫునుంచి కట్నకానుకలు అత్తవారింటికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, ఈ నేపథ్యంలోనే మమత తండ్రి మూడు తులాల బంగారం ఇస్తానని పెళ్లి పీటల మీద హామీ ఇచ్చాడు.
భాగయ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కూతురికి ఇవ్వాల్సిన మూడు తులాల బంగారం కూడా ఇవ్వడం ఆలస్యం అయింది.. ఇకపోతే ఇటీవల పుట్టింటికి వచ్చిన మమత తల్లిదండ్రులను బంగారం విషయంపై అడగగా, ఆర్థిక పరిస్థితి బాగా లేదని మరి కొద్ది రోజులు వేచి ఉండవలసిందిగా వారు ఆమెను అభ్యర్థించారు.. ఇక ఈ విషయంపై సహనం కోల్పోయిన మమత ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం గుళికల మందు మింగడం జరిగింది.
తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న మమతను గమనించిన తల్లిదండ్రులు వెంటనే వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే అక్కడ కూడా లేట్ అవుతుంది అన్న కారణంతో మెరుగైన చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి ,తర్వాత అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది.. ఇక పరిస్థితి విషమించడంతో ఆమె సోమవారం రాత్రి 10 గంటలకు చనిపోయింది.. వికారాబాద్ జిల్లా తాసిల్దార్ రవీందర్ శవానికి శవపంచనామా చేసి , అనంతరం పోస్టుమార్టం కు పంపించారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో, మృతురాలి భర్త నవీన్ , మమత తల్లిదండ్రుల పై కేసు నమోదు చేయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: