అప్పుడప్పుడు అనుకోని విచిత్ర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వీటిని చూసి మనం ఆశ్చర్యపోతూనే ఉంటాం. ప్రస్తుతం ఈ విచిత్ర సంఘటనలో బాతు యు బ్లడీ ఫూల్ అని తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు బాతు తిట్టడం ఏంటని మీరు ఆశ్చర్య పోతున్నారు కదూ. మీరు విన్నది నిజమే నండి.. ఆ బాతు నీటిలో ఈదుతూ యు బ్లడీ ఫూల్ అనే పదాలను తన నోటి ద్వారా పలుకుతోంది. అంతేకాకుండా అనేక బూతులు కూడా మాట్లాడుతుంది. ఆస్ట్రేలియాలోని ఈ బాతు ఎక్కడ నేర్చుకుంది. యు బ్లడీ ఫూల్ అంటే ఒక బూతు పదమే కదా.
ఆస్ట్రేలియాలోని మాస్కు జాతికి చెందినటువంటి బాతు బూతులను ట్రాన్సాక్షన్ ఆఫ్ ది రాయల్ సొసైటీ వారు రికార్డు చేశారు. ఈ యొక్క బాతు తన కేర్ టేకర్ దగ్గర యు బ్లడీ అనే మాటను నేర్చుకున్నదని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి ఆ బాతులు మనిషి యొక్క మాటలు అనుకరిస్తాయని వారంటున్నారు. సదరు బతుకు రిఫర్ అనే నామకరణం చేశారు. అయితే ఈ బాతు మాట్లాడే బూతు మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అది విన్న టువంటి నెటిజన్లు ఊరుకుంటారా.. వారి వారి స్థాయిలో ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. బాతులు కూడా బూతులు మాట్లాడితే ఇంకా ఎలా ఉండాలని వారు అనుకుంటున్నారు. ఇదే కాకుండా చిలుకలు, మైనాలు కస్తూరి బాతులు మాట్లాడతాయని మనందరికీ తెలుసు. పక్షులు కూడా స్వరాలు చేసే సామర్థ్యం ఉంటుందని అధ్యయనంలో తేలింది. అయితే ఈ జాతికి చెందినటువంటి బాతులు మనిషి యొక్క మాటలు అనుసరిస్తారని పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో అక్కడక్కడా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పక్షులు చాలాచోట్ల లో మాట్లాడుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. చివరికి ఈ బాతు మాట్లాడడం వైరల్ గా మారింది.