వైరల్ : ఏకంగా మొబైల్ నే మింగిన మహానుభావుడు.. చివరికి అలా ..!

Divya
సాధారణంగా చిన్న పిల్లలు అయితే తెలియకుండా ఏదైనా చిన్న చిన్న వస్తువులను మింగడం జరుగుతుంది.. కానీ ఇక్కడ అన్నీ తెలిసిన ఒక పెద్ద మనిషి మాత్రం ఏకంగా సెల్ ఫోన్ నే మింగేశాడట.. ఇదెక్కడి చోద్యం.. మొబైల్ ఫోన్ ను మింగడం ఏంటి అని ఆలోచిస్తున్నారా..? ఎక్కువసేపు ఆలోచించకుండా ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చదివితే మీకే చక్కగా తెలిసిపోతుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం చదివేద్దాం పదండి..
యూరోపియన్ దేశం లోని కొసావో లో ఒక వ్యక్తి నోకియా 3310 మింగడంతో అతగాడిని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. అంతేకాదు అతని ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కూడా శస్త్రచికిత్స చేయడం మొదలుపెట్టారు. ఇక ఇతర అంశాల గురించి ఒకసారి చదివి తెలుసుకుందాం.
కొసావో లోని ప్రిస్టినా కు చెందిన 33 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి పాత నోకియా 3310 మోడల్ ను మింగేశాడు. ఇకపోతే ఈ ఫోన్ ప్రారంభించినప్పటి నుంచి అత్యంత వేగంగా ఈ ఫోన్ పని చేయడం గమనార్హం. కానీ ఈ వ్యక్తి ఎందుకు ఫోన్ మింగాడు తెలియదు కానీ , ఫోన్ మింగిన వెంటనే కడుపులో ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే తానే స్వయంగా ప్రిస్టినా లోని ఒక ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించడం జరిగింది.
అయితే ఈ ఆ వ్యక్తిని డాక్టర్లు స్కానింగ్ చేసినప్పుడు అతను ఫోను ను  జీర్ణించుకోలేనంత పెద్దదిగా ఉండటం.. అంతేకాకుండా హానికరమైన రసాయనాలు కలిగిన బ్యాటరీ ఒక్కోసారి పేలే అవకాశాలు కూడా ఉన్నాయని, అదృష్టవశాత్తు అతిపెద్ద శస్త్రచికిత్స చేసి అతని కడుపు నుంచి మొబైల్ ఫోన్ ను  తొలగించినట్లు ప్రముఖ శస్త్రచికిత్స డాక్టర్ తెల్జాకు వివరించడం జరిగింది.
ఇటీవల ఈ డాక్టర్ మాట్లాడుతూ.. పేషెంట్ కు సంబంధించి కాల్ వచ్చింది.. అతనేదో మింగినట్లు మాత్రమే తెలిపారు.. కానీ అతడిని స్కాన్ చేసినప్పుడు కడుపులో మొబైల్ ఫోన్ మూడు భాగాలుగా విడిపోయింది. మిగతా రెండు భాగాల తో పోల్చుకుంటే మొబైల్ బ్యాటరీ అత్యంత ప్రమాదకరం.. ఒకసారి కడుపులో అలాగే ఉండిపోతే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇక 2014 అలాగే 2016 సంవత్సరాలలో కూడా ఇలాగే ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్ మింగినట్లు, వారి కడుపులో నుంచి కూడా శస్త్రచికిత్స చేసి మొబైల్ తీసినట్లు డాక్టర్ తెలిపాడు. అంతేకాదు ఈ డాక్టర్ ఆ వ్యక్తికి సంబంధించిన స్కానింగ్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: