సాధారణంగా మనం రకరకాలుగా మిమిక్రీ చేస్తూ ఉంటాం. మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే అన్ని రకాలుగా తమ వాయిస్ ను మారుస్తూ విభిన్నతను చూపిస్తూ ఉంటారు. అయితే మనుషుల తర్వాత ఎంతో కొంత మాట్లాడేది కేవలం ఒక చిలుక మాత్రమే అంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ వింత పక్షి చేస్తున్న వింత చేష్టలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ పక్షి ఏకంగా చిన్నపిల్లాడిలా ఏడవడం అందర్నీ అబ్బుర పరుస్తోంది. నిజంగానే అక్కడ చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడా ? లేదంటే ఆ పక్షి ఏడుస్తూ ఉందా? అనే విషయాన్ని అసలు గ్రహించలేరు.
సిడ్నీలోని టారోంగా జంతు ప్రదర్శన శాల ఈ వీడియోని ట్విట్టర్ లో పంచుకుంది. అందులో ఉద్యోగులు ఈ విషయం గురించి ఏమంటున్నారంటే... ఈ పక్షిని లైర్ బర్డ్ అంటారని, ఇది వివిధ రకాల శబ్దాలు చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది కార్ హార్న్ లాగా కూడా శబ్దం చేస్తుందట. ఈ జాతుల పక్షులకు వివిధ రకాల వాయిస్ లను గుర్తు పెట్టుకోగల సామర్ధ్యం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇవి ఎప్పటికప్పుడు వివిధ రకాల స్వరాలను అభ్యసిస్తూ ఉంటాయట. లాక్ డౌన్ సమయంలో అక్కడికి వచ్చిన అతిథులలో ఒకరి వాయిస్ ను ఎంచుకొని, ఆ వాయిస్ ను ప్రాక్టీస్ చేయడం కోసం ఈ పక్షి చాలా శ్రమ పడిందట. ఎట్టకేలకు ఆ పసివాడి వాయిస్ ని కాపీ కొట్టేసింది. అయితే ఈ వీడియో చూసిన వాళ్లంతా నిజంగానే షాక్ కు గురవుతున్నారు. ప్రపంచంలో ఇదో అద్భుతమైన వింత అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమాని ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఎన్నో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. వీటి వల్ల నెటిజన్లకు కూడా చాలా వింత వింత విషయాలతో పాటు కొత్త సంగతులు కూడా తెలుస్తున్నాయి.