ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లను గుర్తుంచుకోవాల్సిందేనా ..?

Divya
సాధారణంగా ఏదైనా లావాదేవీలు జరపాలి అనుకున్నప్పుడు, ఖచ్చితంగా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుకు సంబంధించిన పదహారు అంకెలను మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు సరికొత్తగా ఈ విషయంపై వివిధ రకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంతేకాదు వచ్చే సంవత్సరం నుంచి కచ్చితంగా ఈ పదహారు అంకెలను గుర్తు పెట్టుకోవాల్సిందేనా అంటూ తదితరులు తమలో ఉన్న ప్రశ్నలను వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఇటీవల పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఇది దేశంలోనే డబ్బు చెల్లింపు కంపెనీలకు ప్రతినిధి సంస్థ. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసిన వివరాల మేరకు ప్రస్తుతం వస్తున్న వాఖ్యలు ఏవి కూడా సరైనవి కావని, వచ్చే సంవత్సరం నుంచి మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుకు సంబంధించిన 16 అంకెలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని వీరు తెలపడం జరిగింది.

ప్రస్తుతం సిపిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పని చేస్తున్నట్లు తెలిపింది. ఒక ఫైల్ ఆధారిత సొల్యూషన్స్ పై పనిచేస్తున్నట్లు తెలపడం గమనార్హం. అంటే కస్టమర్‌ లు డెబిట్ , క్రెడిట్ కార్డ్ ఆధారాల నిల్వ భద్రతను మెరుగుపరచడానికే,  ఆన్‌లైన్ కొనుగోళ్లకు సమానమైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి  PCI పాటు పడుతున్నట్లు సమాచారం.

2020 సంవత్సరం మార్చి నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ సిస్టం ప్రొవైడర్ లతో జారీ చేసిన పేమెంట్ సంబంధిత మార్గదర్శకాల చట్టంలో కస్టమర్ కార్డ్ ఆధారాల నిల్వ భద్రతను మెరుగుపరచడం కోసం  పని చేయగల సామర్థ్యాన్ని అందించమని కోరింది. ఒకవేళ సక్సెస్ అయితే ఇకపై ప్రతి సారి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు సంబంధించిన 16 నెంబర్ లను నమోదు చేయవలసిన అవసరం ఉండదు.

అమెజాన్ తో పాటు ఫ్లిప్‌కార్ట్ అలాగే నెట్‌ఫ్లిక్స్ వంటి వ్యాపారులు తమ సర్వర్లు లేదా డేటాబేస్‌లలో వినియోగదారుడు ఉపయోగించే సమాచార క్రెడిట్ లేదా డెబిట్ కార్డును నిల్వ చేయకుండా నిరోధిస్తాయి. సెక్యూర్ గా ఉండడంతోపాటు కష్టమర్ కు పని మరింత సులభతరం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: