వైరల్: చిన్న విషయానికే పెళ్లి క్యాన్సిల్ అట ?
అవునండీ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అసలు విషయానికి వస్తే... కాసేపట్లో పేలి జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొద్ది క్షణాల్లో పెళ్లి కూతురు వచ్చే వేళయింది. అంతా హడావుడిగా ఉన్నారు. ఇంతలో పెళ్లి కూతురు రానే వచ్చింది. వాచీ రాగానే ఏడుస్తూ నాకు ఈ పెళ్లి వద్దు అంటూ నానా హంగామా చేసింది. పెళ్లి కూతురు ఫ్రెండ్స్, అలాగే బ్రదర్స్ ఈ సంఘటన చూసి షాక్ తిన్నారు. అదేంటి.. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఏడుస్తూ పెళ్లి వద్దు అంటోంది అని కంగారు పడుతున్నారు. చివరికి ఆమెను గుచ్చి గుచ్చి అడిగితే అసలు విషయం తెలిసింది.
పెళ్లికి ముందుగానే ఆమె నేను ఎంటర్ అయ్యేటప్పుడు స్పెషల్ సాంగ్ ప్లే చేయమని చెప్పిందట, కానీ ఆమె వచ్చేటప్పుడు ఆ సాంగ్ కాకుండా వేరే సాంగ్ ప్లే చేశారని ఈ హంగామా అంతా చేసిందట. ఇది విన్న అక్కడి వారు నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాయరు. చివరికి అందరూ మాట్లాడి పెళ్ళికి ఒప్పించగలిగారు. చూశారా ఒక చిన్న కోరిక వల్ల పెళ్లి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది తెల్సిన నెటిజన్లు ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.