లవర్స్ ఫేవరెట్ చాక్లెట్ లో గొడ్డు మాంసం.. ?

frame లవర్స్ ఫేవరెట్ చాక్లెట్ లో గొడ్డు మాంసం.. ?

MADDIBOINA AJAY KUMAR
చిన్న పిల్లల నుండి పెద్దవారి దాకా చాక్లెట్స్ ను ఇష్టపడని వారంటూ ఉండరు. ప్రతిఒక్కరూ చాక్లెట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఇక చాక్లెట్స్ లో ఒక్కొక్కరికీ ఒక్కో చాక్లెట్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అలా ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే చాక్లెట్ డైరీ మిల్క్. ఈ చాక్లెట్ ను చిన్న పిల్లలు ఎంతగా ఇష్టపడతారో యూత్ కూడా అంతే ఇష్టపడతారు. ఫ్రెండ్షిప్ డే...ల‌వ‌ర్స్ డే ఇలా ఏ డే వ‌చ్చినా డైరీ మిల్క్ చాక్లెట్ ల‌ను ఇచ్చిపుచ్చుకుంటారు. ముఖ్యంగా యూత్ లో అమ్మాయిలు ఈ చాక్లెట్స్ అంటే ప‌డిచ‌స్తారు. దాంతో అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ కి ఈ చాక్లెట్లు ఎక్కువగా ఇస్తుంటారు. ఇక డైరీ మిల్క్ లో ఎన్నో రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి. వీటిలో డైరీ మిల్క్ సిల్క్ ని మరీ ఎక్కువగా ఇష్టపడతారు. 


ఈ చాక్లెట్ కు సంబంధించి టీవీలో వచ్చే యాడ్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తియ్యని వేడుక చేసుకుందాం అంటూ డైరీ మిల్క్ యాడ్ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు డైరీ మిల్క్ గురించి ఇంత చెప్పుకోవడం ఎందుకంటే తాజాగా దీనిపై ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే....డైరీ మిల్క్ చాక్లెట్ లో గొడ్డుమాంసం కలుస్తుంద‌ని ఆ సంస్థ ప్రకటించినట్టుగా ఒక స్క్రీన్ షాట్ తెగ వైరల్ అవుతోంది. డైరీ మిల్క్ చాక్లెట్లు ఎంతో ఇష్టంగా తినే అమ్మాయిలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా చిన్న పిల్లలకు కనిపించకూడదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాగా దీనిపై తాజాగా క్యాడ్బరీ డైరీ మిల్క్ స్పందించింది.


తాము తయారు చేస్తున్న మరియు ఇండియాలో అమ్ముతున్న తమ ప్రొడక్ట్స్ అన్నీ 100% శాకాహారమే అని ప్రకటించింది. సోషల్ మీడియాలో తమ కంపెనీ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుందని గొడ్డుమాంసం నుంచి తీసిన జెలిటెన్ అనే పదార్థంతో డైరీ మిల్క్ చాక్లెట్ ను తయారు చేస్తున్న‌ట్టు పుకార్లు వ‌స్తున్నాయ‌ని తెలిపింది. కానీ అదంతా అసత్య ప్రచారమని డైరీ మిల్క్ కొట్టిపారేసింది. అంతేకాకుండా చాక్లెట్ పైన ఉండే గ్రీన్ మార్క్ అనేది 100% శాకాహారం అని సూచిస్తుంది అని ప్రకటించింది. భారతదేశ ఆహార చట్టానికి సంబంధించి తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఇక మొద‌ట చాక్లెట్ లో గొడ్డు మాంసం క‌లుస్తుంద‌ని ఆస్ట్రేలియాకు చెందిన ఓ వెబ్ సైట్ పేర్కొంది. దాంతో ఈ విష‌యం వైర‌ల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: