పెంపుడు పిల్లి మిస్సింగ్.. ఆచూకీ తెలిపితే నగదు..

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో చాలా మందికి కూడా మనిషి విలువ తెలీకుండా పోయింది. ఈరోజుల్లో మనుషులు కనిపించకుండా పోతేనే అస్సలు పట్టించుకోరు.తన పెంపుడు పిల్లి తప్పిపోయిందంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పైగా ఆ పిల్లిని పట్టించినవారికి 30వేల రూపాయల నగదు కూడా ఇస్తానని ప్రకటించింది ఆమె.ఇక ఈ మిస్సింగ్ కేసు నమోదైంది ఎక్కడో కాదు..మన బాగ్యనగరం హైదరాబాద్‌ లోనే.హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన సెరీనా అనే అమ్మాయి స్వతహాగా ఓ జంతు పేమికురాలు. చిన్నతనం నుండి ఆమె ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతున్నారు. గత ఎనిమిది నెలల క్రితం అప్పుడే పుట్టిన జింజర్ అనే పిల్లిని దత్తత తీసుకున్నారు సెరీనా. అప్పటి నుండి ఆమె జింజర్ ను చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు.


ఇక అలాగే కరోనా నేపథ్యంలో పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేందుకు జూబ్లీహిల్స్ లోని పెట్ క్లినిక్ లో జూన్ 17 న సర్జరీ చేయించడం జరిగింది.కుట్లు వేసిన చోట మళ్ళీ వాపు రావడంతో మళ్ళీ తిరిగి జూన్ 23న అదే హాస్పిటల్ కు తీసుకెళ్లిందట. అయితే, అక్కడే చికిత్స పొందుతున్న సదరు పిల్లి జూన్ 24న హాస్పిటల్ నుండి తప్పిపోయినట్లు ఆస్పత్రి సిబ్బంది ఆమెకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక దీంతో నిర్లక్ష్యంపై కోప్పడిన సెరీనా పోలీసులను ఆశ్రయించడం జరిగింది.ఇక తన పిల్లి తప్పిపోయిన విషయం పై జూన్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సెరీనా ఫిర్యాదు చేయడం జరిగింది.ఇక పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో, ఆమె స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పాంప్లెంట్స్ పంచుతూ కన్నీరు పెట్టుకుంది. తన పిల్లి ఆచూకీ కోసం గత 20 రోజులుగా వెతుకుతున్నా లాభం లేకపోయిందని బాధ పడింది. తన పెంపుడు పిల్లి ఆచూకీ తెలిపిన వారికి ముప్పై వేల నగదును సెరీనా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: