వైరల్ వీడియో : వీధి బాలుడికున్న కామన్సెన్స్ కూడా లేకపోయిందే?

praveen
ప్రస్తుత రోజుల్లో మాస్క్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది. చైనా నుంచి వెలుగులోకి వచ్చిన కరోనా ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తున్న తరుణంలో మాస్కులు లేకుండా బయటకు వెళితే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎంతోమంది నచ్చిన నచ్చకపోయినా మాస్కు మాత్రం ధరించడం తప్పనిసరి అయింది. దీంతో ప్రపంచం మొత్తం మాస్కు ముసుగులోని ముందుకు సాగుతోంది.  ఇక ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ పై అవగాహన రావడంతో ఇక ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మాస్క్ ధరిస్తున్నారు.

 సామాన్యులు సెలబ్రిటీ అని తేడా లేకుండా అందరూ మాస్క్ పెట్టుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా కారకులుగా మారిపోతున్నారు.  కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి కోలుకున్న కొన్ని రాష్ట్రాలు లక్షలు ఎత్తివేసాయి. ఈ క్రమంలోనే కొన్ని పర్యాటక ప్రాంతాలు టూరిస్టుల తో నిండిపోయాయి. అయితే టూరిస్టులు కనీసం జాగ్రత్తలు పాటించడం లేదు కనీసం మాస్క్ ధరించడం లేదు.  దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అక్కడ పెద్ద పెద్ద చదువులు చదివిన టూరిస్టులు వచ్చారు. కానీ వారికి కనీస కామన్సెన్స్ లేకుండా పోయింది.

 ఎంతలా అంటే అక్కడ ఉన్న వీధి బాలుడు కి ఉన్న కామన్సెన్స్ కూడా అక్కడికి వచ్చిన వారికి లేకుండా పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీధి బాలుడు ఒక కర్ర పట్టుకొని మాస్కు పెట్టుకోవాలి అంటూ  అందరినీ హెచ్చరిస్తున్నాడు. లేక పోతే కరోనా ప్రాణం తీస్తుంది అంటూ చెబుతున్నాడు. అయిన ఆ  బాలుడు మాటలు మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఆ బాలుడు చెబుతుంది నిజమే అని తెలిసినప్పటికీ అతన్ని చూసి నవ్వుతూ వెళ్లిపోయారు తప్ప కామన్ సెన్స్ తో మాస్కు మాత్రం పెట్టుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిమాచల్ ప్రదేశ్ లోని బౌద్ధ క్షేత్రం ధర్మశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది చూసిన నెటిజన్లు చదువుకోని ఆ వీధి బాలుడు కున్న కామన్సెన్స్ కూడా పెద్ద పెద్ద చదువులు ఉన్నవారికి లేకుండా పోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: