జాతీయ వైద్యుల దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

Divya

ముఖ్యంగా ఈ రోజునే వైద్యుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు అంటే, 1882 జూలై ఒకటవ తేదీన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మించారు. అయితే ఈయన తన 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఈయన  ముఖ్యమంత్రి కాకముందు వైద్యుడిగా ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను నిలబెట్టిన దైవం..ఇక  1961 ఫిబ్రవరి 4వ తేదీన ఈయన వైద్య రంగానికి చేసిన విస్తృత కృషికి, దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆయన భారతరత్నతో సత్కరించడం జరిగింది. ఇక 1962 జూలై 1వ తేదీన ఆయన మరణించడం జరిగింది. ఇక అందుకే ఆయన వైద్య రంగానికి చేసిన కృషికి గానూ ఆయన మరణించిన రోజుని జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

మనం విగ్రహాల రూపంలో దేవుడిని పూజిస్తే, నిజస్వరూపంలో వైద్యుల రూపంలో దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుండి ప్రపంచాన్ని కాపాడిన దేవదూతలుగా ఈ వైద్యులు మనకు ఎన్నో సేవలు చేశారు. ఇక ప్రజలకు తమ వంతు సహాయం చేయాలని, ప్రజలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూడాలని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడిన దేవుళ్ళుగా మనం  వైద్యులను పరిగణించవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత విలువ వైద్యులకు ఉంది అంటే వైద్యులు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నారో  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వైద్యుడి దగ్గరకు వెళ్తాము.. ఎందుకంటే ధైర్యంగా ఆ వైద్యుడు మనకు వచ్చిన సమస్యను దూరం చేస్తాడు అని.
ఇక జాతీయ వైద్యుల దినోత్సవం  సందర్భంగా పలువురు.. వైద్యులకు గ్రీటింగ్స్ అందించడంతో పాటు వారు చేసిన సేవలను దేశమంతా గుర్తుంచుకునేలా పలు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఏది ఏమైనా దేవుడి ప్రతి అంశ గా  మనం వైద్యులను పరిగణించ వచ్చు. కాబట్టి వైద్యులను గౌరవిద్దాం.. వారి సేవలను గుర్తిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: