కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ గత కొంతకాలం నుంచి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని నెస్కో కోవిడ్ సెంటర్ హెల్త్ కేర్ వర్కర్స్ కాస్త సౌకర్యం కోసం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ మరాఠీ పాటైన జింగాత్ పాటకు డాన్స్ చెయ్యడం జరిగింది.పలు జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి రక్షణగా హెల్త్ వర్కర్స్ పిపిఇ కిట్స్ వేసుకొని కరోనా రోగులు లేని వార్డులో డాన్స్ చేయడం జరిగింది. ఇక గత మూడు రోజుల నుంచి కూడా ఈ వేడుకల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.వీడియోలో చూసినట్లయితే హెల్త్ కేర్ వర్కర్స్ బ్లూ కలర్ పిపిఇ కిట్లు ధరించి బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నారు.కొందరు రోగుల కోసం పడకలపైకి ఎక్కారు. ఇక ఈ డాన్స్ వేడుక చాలా కఠినమైన పరిస్థితులలో కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ఉపశమనం కలిగించిందనే చెప్పాలి.
మరాఠీ పాట జింగాత్ 2016 చిత్రం సైరత్ నుండి విడుదల అయ్యింది.విడుదలైన వెంటనే ఈ పాట పెద్ద హిట్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఏ వేడుక జరిగిన ఈ పాట పెట్టడం ఖాయం. ఈ పాట లేని పెళ్లి లేదు. అలాగే ఫంక్షన్ కూడా లేదు. ఇప్పటికి కూడా ఏదైనా ఫంక్షన్ జరుపుకోవాలంటే ఈ పరిస్థితిలో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకొని మరి ఈ పాట పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు.ఇక పోతే మే నెలలో ఎక్కువ స్థాయి నుండి రోజువారీ కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయనే చెప్పాలి.గత వారం పదిరోజుల నుంచి కరోనా ఉధృతి తగ్గుతుందనే చెప్పాలి.జూన్ ఎండింగ్ లేదా జులై మొదటి వారానికల్లా కేసులు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని స్పష్టంగా అర్ధమవుతుంది.ఇక ముంబై హెల్త్ కేర్ వర్కర్స్ డాన్స్ ని మీరు ఈ కింది వీడియోలో గమనించవచ్చు.
Your browser does not support HTML5 video.