ఆ మాస్కులందు బాబా మాస్క్ వేరయా..

Satvika
కరోనా మహమ్మారి కారణంగా ప్రజలకు చావు భయం పట్టుకుంది. ఎక్కడ చనిపోతామో అని జనాలు ముందే చనిపోతుండటం గమనార్హం.. అంతగా దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవ్వగా, లక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఒకవైపు కరోనా నియంత్రణలో భాగంగా వచ్చిన వ్యాక్సిన్ మహమ్మారి పై అంతగా ప్రభావాన్ని చూపించలేదు. ఇక చేసేదేమి లేక ప్రభుత్వాలు మళ్ళీ లాక్ డౌన్ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.


మరోవైపు కరోనా పై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు మాత్రమే బయట తిరిగేలా ఆంక్షలు విధించారు. మాస్క్, శానిటైజర్ లేకుండా బయటకు వస్తే వీరబాదుడు బాదుతున్నారు పోలీసులు. అంతేకాదు భారీగా చలానా విధిస్తున్నారు. ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తున్నారు. మాస్క్ పై సరికొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. గతంలో ఓ పెద్దాయన గిజిగాడు గూడు తో మాస్క్ ధరించి అందరిని షాక్ కు గురిచేశాడు.


ఇది ఇలా ఉండగా తాజాగా మరో స్వామిజి మాస్క్ పై వినూత్న ఆలోచన చేసాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జుగాడు బాబా కరోనా నుంచి రక్షణ కోసం ప్రకృతి మాస్క్‌ ధరించాడు.ప్రస్తుతం బాబా ధరించిన వేప, తులసి ఆకులతో తయారు చేసిన మాస్క్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను రూపీన్‌ శర్మ అనే ఐపీఎస్‌ అధికారి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ''ఈ మాస్క్‌ కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని కచ్చితంగా చెప్పలేం.కానీ అవసరం తల్లి లాంటిది'' అని పేర్కొన్నాడు.జనాలు సాధారణంగా ఉపయోగించే మాస్క్‌ల కంటే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నట్టు బాబా తెలిపారు. తులసి, వేప ఆకులతో చేసిన ఈ మాస్క్‌ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. కాగా జుగాడు బాబా ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా బస్ స్టాండ్ వద్ద ఈ ప్రకృతి మాస్క్‌తో కనిపించినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: