వామ్మో! భారీ కప్ప.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Purushottham Vinay
ఈ భూమ్మీద పాములు, బల్లులు, తొండలు, మొసళ్ళు, తేళ్ళు లాంటి జంతువులు చాలా కంపరంగా ఉంటాయి. ముఖ్యంగా కప్పలు చాలా వికారంగా వాటిని చూస్తానే ఒళ్ళంతా గగూర్పొడుస్తూ ఎంతో చిరాకుగా ఉంటుంది. ఇక అలాంటి కప్పలు భారీ సైజువి చూస్తే ఇక ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి అరుదైన భారీ కప్ప బయటపడింది. అది ఏకంగా ఒక శిశువు అంత సైజులో వుంది.వివరాల్లోకి వెళ్తే... సోలమాన్ దీవుల్లో జిమ్మీ హ్యూగో అనే వ్యక్తి స్థానిక అడవుల్లో అడవి పందులను వేటాడుతుంటాడు. ఇందులో భాగంగా ఇటీవలే అడవీలో ప్రయాణిస్తుండగా భారీ సైజులో ఉన్న కప్ప కనిపించింది. దాన్ని చూసేంత వరకు ఎవరో శిశువు అని అనుకున్నాడు. అనంతరం కప్ప అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఈ కప్ప ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ కప్పని చూసిన నెటిజన్స్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ కప్ప ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


ఇక ఈ భారీ కప్పని కార్నుఫర్ గుప్పీ జాతికి చెందిన కప్పగా దీన్ని గుర్తించారు. ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కప్పల్లో ఒకటి. ఇది సాధారణంగా న్యూ బ్రిటన్ నుంచి సోలమన్ దీవుల బిస్మార్క్ ద్వీప సమూహాల్లో కనిపిస్తుంది.ఈ అసాధారణ భారీ కప్పను చూసిన ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. తమ కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో విశేషంగా స్పందిస్తున్నారు. జురాసిక్ పార్క్ సినిమా నుంచి నేరుగా వచ్చిందని కొంతమంది కామెంట్ చేయగా.. ఇది అద్భుతమైన జీవిగా అభివర్ణించారు. ఈ కప్ప గురించి మరింత సమాచారం తెలియజేయాలని ఇంకొందరు తమ పోస్టుల ద్వారా తెలిపారు. ఇది చాలా భయంకరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇది కప్ప లేక గ్రహంతరవాస అని కామెంట్స్ చేస్తున్నారు.బహుశా సోలమాన్ దీవుల్లో ఉన్న మెలనేషియాలో ఇదే అతిపెద్ద నీటి కప్ప అని పర్యావరణ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: