ప్రియురాలిని మోసం.. లైవ్ లో బుక్కైన ప్రియుడు

Suma Kallamadi
ఓ అమ్మాయిన తన బాయ్ ఫ్రెండ్ మోసం చేయాలనుకున్నాడు. చివరికి తానే గోతిలో పడ్డట్టయ్యింది. తనను మిస్సవుతున్నానని తన ప్రేయసికి ప్రేమికుడు చెప్పాడు. అయితే ఆమె తన తెలివితేటలతో అతన్ని పసిగట్టేసింది. తన బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో హోటల్ గదిలో ఉండటాన్ని గమనించింది. ఆ అమ్మాయి పేరు సెరెనా కెర్రిగాన్. ఆమె ఓ ఫొటోను షేర్ చేస్తూ... "మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తి... మిమ్మల్ని మిస్ అవుతున్నానని చెబితే మీరు లైవ్ ఫొటో క్లిక్ చెయ్యండి" అని క్యాప్షన్ పెట్టింది. దాని పక్కన ఓ పుర్రె, డేంజర్ సింబల్ ఇమోజీ పెట్టింది. ఈ ఫొటోలో కనిపిస్తన్నది ఓ హోటల్ లోని బెడ్ అని ఆమె తేల్చింది. దాని తలగడల దగ్గర ఓ మెత్తటి బొమ్మ ఒకటి ఉంది. ఆ ఫొటోకి సంబంధించి లైవ్ వెర్షన్‌ను ఆమె ట్యాప్ చేసింది. అప్పుడు ఆమె ఆ బొమ్మతో పాటూ అతను మరొక అమ్మాయితో ఉన్నట్లు గుర్తించింది. కొన్ని సెకండ్ల తర్వాత క్యాప్చర్ అయిన లైవ్ ఫొటోలో మరో అమ్మాయి బెడ్‌పై నవ్వుతూ పడిన దృశ్యం ఉంది. అంతే అతను తనను మోసం చేశాడని ఆమె గుర్తించింది.
ఆమె పెట్టిన టిక్ టాక్ వీడియోను ఇప్పటికే కోటి 20 లక్షల మందికి పైగా చూడటమే కాకుండా 9,600 కామెంట్లు వచ్చాయి. కొంత మంది లైవ్ ఫొటో అంటే ఏంటో దాన్ని ఎలా చెయ్యాలో ఎలా సెర్చ్ చెయ్యాలో టిప్స్ ని ఒక నెటిజన్లు వివరించాడు. లైవ్ ఫొటో అనేది యాపిల్ ఐఫోన్ ద్వారా ఎవరైనా లైవ్‌లో ఓ ఫొటో తీసి ఎవరికైనా పంపారనుకోండి. ఆ కెమెరా ఆ ఫొటోకి 1.5 సెకండ్లు ముందు, 1.5 సెకండ్లు తర్వాత కూడా ఫొటోలను రికార్డ్ చేస్తుంది. కానీ పైకి మాత్రం ఒకటే ఫొటో తీసినట్లు చూపిస్తుంది. ఎవరైనా ఆ ఒకటే ఫొటోకి లైవ్ వీడియో టైపు ఫొటో చూడాలి అనుకుంటే ఆ ఫొటోను కాసేపు ట్యాప్ చెయ్యాలి. దాంతో ఆ ఫొటోకి ముందు, తర్వాత ఏం జరిగిందో చూపిస్తుంది. సౌండ్ కూడా రికార్డ్ చేస్తుంది. మన కథలో కూడా లవర్ పంపినది ఒకటే లైవ్ ఫొటో. అయితే దాన్ని ఆమె ట్యాప్ చెయ్యడంతో ఆ ఫొటో కాస్తా లైవ్ వీడియో ఫొటోగా మారింది. దాంతో అసలు విషయం తెలిసి ఆమె ప్రేమికుడు భయపడిపోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: