టాయిలెట్ లో కాలక్షేపం చేసినందుకు ఉద్యోగికి కంపెనీ ఏం చేసిందో తెలుసా?
గత నెల తాను 22 రోజుల్లో మొత్తం 195 గంటలు పనిచేశానని తెలిపాడు. ప్రతి గంటకు సంస్థ 160 యువాన్ (రూ.1826) చొప్పున చెల్లిస్తోందని, తన నెల జీతంలో 4,400 యువాన్ (రూ.50,198) కట్ చేసిందని వివరించాడు. ఇలా చేయడం చాలా అన్యాయమని పేర్కొన్నాడు. మేనేజ్మెంట్ రోజులో ఒక గంట మాత్రమే టాయిలెట్‌కు సమయం ఇస్తుందని, కాబట్టి తాను 27.5 గంటలు మాత్రమే టాయిలెట్లో ఉన్నట్లు లెక్క అని తెలిపాడు.‘‘ఒకే, నేను టాయిలెట్లో అంత సేపు ఉండటం తప్పే. కానీ, అన్యాయంగా నా జీతాన్ని కట్ చేయడం న్యాయమేనా? ఈ విషయాన్ని ప్రశ్నిస్తే.. ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. దీనిపై లేబర్ బ్యూరోకు పిర్యాదు చేస్తా.
నేను ఒక వేళ టాయిలెట్‌కు వెళ్లి ఉండకపోతే.. నా పాంట్‌లోనే విసర్జన చేసేవాడిని, ఆఫీసు మొత్తం కంపు చేసేవాడిని’’ అని తెలిపాడు. అయితే, సోషల్ మీడియాలో దీనిపై కొంతమంది అతనికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.‘‘రోజుకు రెండు గంటలు టాయిలెట్లో ఏం పని నీకు?’’ అని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ‘‘నువ్వు టాయిలెట్లో గడిపిన గంటలన్నీ కలిపితే.. దాదాపు రెండు రోజులు. అంటే నువ్వు నెలలో రెండు రోజులు ఆఫీసులో కంటే టాయిలెట్లోనే ఎక్కువ సేపు కూర్చుంటున్నావు’’ అని కామెంట్లు చేస్తున్నారు. ‘‘కంపెనీ నిన్ను ఆఫీసులో బుద్ధిగా కూర్చొని పనిచేయమని ఉద్యోగం ఇచ్చింది. అంతేగానీ.. రోజుకు రెండు గంటలు టాయిలెట్లో కూర్చోమని కాదు.కొంచమైనా బాధ్యత ఉండనక్కర్లేదా ’’ అని అతడిని తప్పుబడుతున్నారు.