ఛీ ఛీ! పెళ్లి కొడుకు ముందే మాజీ ప్రియుడితో అలా చేసిన పెళ్లి కూతురు...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు మన మాజీ ప్రియులు మన ఎదుట పడితే ఎలా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉండదు. కాని ఇక్కడ విషయం ఇంకోలా వుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలో జరిగిన ఓ పెళ్లిలో ఇలాంటిదే చోటుచేసుకుంది. తన పెళ్లికి హాజరైన మాజీ ప్రియుడిని ఓ వధువు హత్తుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు ఆమె వరుడి అనుమతి తీసుకోవడం గమనార్హం. అయితే, నెటిజనులు మాత్రం వధువును తిట్టిపోస్తున్నారు.ఓ అమ్మాయి  ఇటీవల తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను టిక్‌టాక్ అకౌంట్లో  పోస్ట్ చేసింది. తన మాజీ ప్రియుడు పెళ్లికి హాజరయ్యాడని, తమని విష్ చేశాడని తెలిపింది. అయితే, ఈ వీడియోలో ఆమె తన మాజీ ప్రియుడిని చూడగానే సంతోషంతో ఊగిపోయింది.
అతడు షేక్ హ్యాండ్ ఇచ్చి వధువును విష్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, వధువు అతడిని హగ్ చేసుకుంటానని వరుడిని అడిగింది.ఇక ఆ వరుడికి సిగ్గుందో లేదో... ఆ  వరుడు ఇందుకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో ఆమె వరుడి ముందే పెళ్లి వేదికపై మాజీ ప్రియుడిని హగ్ చేసుకుని ఆశ్చర్యపరిచింది. వరుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ కావడం వీడియోలో స్పష్టంగా తెలిసింది. వధువును కౌగిలించుకున్న తర్వాత అతడు వరుడిని కూడా హగ్ చేసుకుని విష్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజనులు వధువును తిట్టిపోస్తున్నారు.
భర్త ముందే మాజీ ప్రియుడిని గట్టిగా కౌగిలించుకోవడం  మంచి పని కాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ‘‘కనీసం వరుడి అనుమతి తీసుకుంది, అదే సంతోషం’’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘‘వరుడు హర్ట్ అయినట్లు ముఖంలో స్పష్టంగా కనిపించింది.అతడి ఎదురుగా మరో వ్యక్తిని హగ్ చేసుకోవడం మంచి పద్ధతి కాదు. అలా చేయడం భర్తను అగౌరవపరచడమే’’ అని కోపంతో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: