బిగ్ బాస్ 4 : మరోసారి సత్తా చూపిన అభిజిత్ ఫ్యాన్స్ ..రచ్చ రచ్చే .!!

KISHORE
తెలుగు లో అల్టిమేట్ రియాలిటీ షో " బిగ్ బాస్ " ఎట్టకేలకు చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం మంచి రసవత్తరంగా నడుస్తున్న బిగ్ బాస్ 4 సీజన్ కు టైటిల్ విన్నింగ్ రేస్ లో మాత్రం కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో అభిజీత్ కూడా ఖచ్చితంగా ఉంటాడని చెప్పాలి. తనదైన ఆటతో ఇతరులకు గట్టి పోటీగా కొనసాగుతున్నాడు. అయితే ప్రతీసారి ప్రతీ బిగ్ బాస్  సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ కు ఒక యూనిక్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది.

మొదట శివ బాలాజి ,కౌశల్,రాహుల్ సిప్లిగంజ్ ,బిగ్ బాస్ తోనే సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.  అలా ఈసారి అభిజీత్ కు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే అభిమానించే వారు ఉన్నారు. అలాగే మరికొంతమంది స్మాల్ స్క్రీన్ ప్రముఖులు కూడా అభిజీత్ కు సపోర్ట్ చేస్తున్నారు. అయితే అభిజీత్ కు ఏ రేంజ్ లో ఓటింగ్స్ పడుతున్నాయో అన్నది పక్కన పెడితే స్టార్ మా వారు సోషల్ మీడియా లో నిర్వహించిన   "మీకు నచ్చిన రాజు,రాణి ఎవరు ?" అనే పోల్ కాంటెస్ట్ లో అభి ఫాలోవర్స్ యూనానిమస్ రెస్పాన్స్ తో షాకిచ్చారు.

ఎలాగో డేస్ పెరుగుతుండడంతో షో పట్ల ప్రేక్షకులకు స్టార్ మా వారు సోషల్ మీడియా ద్వారా మరింత చేరువవుతున్నారు. అలా లేటెస్ట్ గా ఆడియెన్స్ ను వారికి నచ్చిన రాజు/రాణి ఎవరు అని అడిగితే అభిజీత్ పేరిటే ఊహించని రెస్పాన్స్ ను అందించారు. బహుశా 90 శాతానికి పైగా అభికే తమ ఓట్ ను డిక్లేర్ చేసేసారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అభిజిత్ కి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఏర్పడిందన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: