వైరల్ ఎహే: పీఎస్ లో పోలీసులు చేసిన పనికి.. వావ్ క్యా మజా ఆగయా.. ! వీడియో

venugopal

పోలీస్ ప్రస్తుతం కరోనా వ్యాపించకుండా పోరాడుతున్న యోధుల్లో ఒకరు.. నిరంతరం కర్తవ్య నిర్వహణలో తలమునకలై.. వచ్చే చికాకును.. పిడికిట్లో అదిమిపెట్టుకుంటు.. ఏ కాస్త సమయం చిక్కినా అంతవరకు ఉన్న అలసటను మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.. క్రికెట్ మైదానంలో ఉన్న బ్యాట్ మెన్ బాల్‌ను ఎంత బలంగా ఉతికితే సిక్స్ పోతుందో అనే ఆలోచనలో ఉంటే.. ప్రస్తుతం కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా ఎంత బలంగా కొడితే వీడి పిర్రలకు వాతలు వస్తాయని ఆలోచిస్తుంటారు కావచ్చూ..

 

 

ఇద్దరి గమ్యం ఒక్కటే అదే ఉతకడం.. కాకపోతే అక్కడ బంతి.. ఇక్కడ మనిషి.. ఎందుకంటే కొందరు వ్యక్తులు బయటకు వెళ్లకండని చెప్పితే ఊరికే పనికి మాలిన పనులు మెడకు తగిలించుకుని ఏవో కుంటి సాకులు చెబుతూ కరోనాను కండీషన్ లేకుండా ఆహ్వానిస్తున్నారు.. మరి ఇలాంటి వారు మాటలతో వినరు కదా.. అసలే కరోనా అనేది పెద్ద దొంగ.. ఏ వైపు నుండి వస్తుందో.. ఎవరి నుండి వస్తుందో అర్ధం కాక ప్రపంచం మొత్తం కిందమీద పడుతుంటే.. దీన్ని ఆపాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించండిరా బాబు అంటే సరిగ్గా వినడం లేదు కొందరు.. ఇలాంటి పరిస్దితులను అదుపులోకి తేవాలంటే పోలీసులకు తలకు మించిన భారంలా మారింది.. అందుకే ఎక్కువశాతం పోలీసులు పెద్దపులుల్లా ఉంటున్నారు..

 

 

మరి వీరికి కూడా అందరిలా ఆనందంగా ఉండాలని ఉంటుంది కదా.. కానీ ఏం చేస్తారు... బయటకు చెప్పుకోలేరు.. అదీగాక ఈ లాక్ డౌన్ తో వారి జీవితం కూడా లాక్‌డౌన్ అయ్యింది.. ఈ క్రమంలో ప్ర‌జ‌ల సంక్షేమం కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ ప‌డుతున్నారు. ఒకరకంగా క‌రోనా పై చేస్తున్న పోరులో పోలీసులు కీల‌క భూమిక పోషిస్తున్నారు.. ఇదిలా ఉండగా వారికున్న టెన్షన్స్ తగ్గించుకునేందుకు.. అసోంలోని న‌గావ్ పోలీస్ స్టేష‌న్ లో కోవిడ్‌-19 స్పెష‌ల్ డ్యూటీపై ఉన్న పోలీసులు.. మ‌ధ్య మ‌ధ్య‌లో డ్యాన్స్ చేస్తున్నారు.

 

 

ఇందులో భాగంగా వారి సంప్ర‌దాయ నృత్యం అయినా బిహు డ్యాన్స్ ను చేస్తూ కాసేపు స‌రదాగా గ‌డిపారు. ఇకపోతే ఎస్పీ ఆఫీసులో పోలీసులంతా చ‌ప్ప‌ట్లు కొడుతూ, సంప్ర‌దాయ స్టెప్పేలేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది... మీరు కూడా చూసి ఆనందించండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: