వీడెవడండీ బాబు.. ఒళ్లంతా తేనెటీగలతో విన్యాసం?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషాల వ్యవధిలో అది కళ్ళ ముందు వాలిపోతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చిత్ర విచిత్రమైన ఘటనలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. సోషల్ మీడియాలో పాపులారిటీ కావడం కోసం కొంతమంది చేసే పిచ్చి పనులు అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉన్నాయి. ఏకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొంతమంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్న ఘటనలు నేటి రోజుల్లో కోకోళ్లలుగా ఇంటర్నెట్లో ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి.

 ఇక ఇలాంటి వీడియోలు ఏవైనా తారసపడినప్పుడు నిజంగానే వీడియోలో కనిపించేది నిజమా లేకపోతే అదంతా కేవలం గ్రాఫిక్స్ మాత్రమే అని నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది. సాధారణంగా తేనెటీగలు అంటే అందరూ భయపడి పోతారు. ఎందుకంటే ఒక్కసారి తేనెటీగ వచ్చి కరిచిందంటే చాలు ఆ నొప్పిని భరించడం చాలా కష్టం. అంతేకాదు తేనెటీగ కరిచిన చోట ఒక్కసారిగా వాపు వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మొత్తంలో తేనెటీగలు దాడి చేస్తే చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

 కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఏకంగా తేనెటీగలతోనే ఒక విన్యాసం చేశాడు. ఏకంగా తనతో పాటు తేనెటీగలను కూడా మోసుకుంటూ వీధిలో నడుస్తున్న దృశ్యాలు చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో కనిపించే బాలుడు తేనెటీగల పెంపకంతోనే వ్యాపారం చేస్తున్నాడు. అయితే తేనెటీగలు అతనికి ఇలా అంటుకోవడం నిజంగా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే తేనెటీగలు ఎవరు ఎలా దొరికినా కూడా దారుణంగా దాడి చేసి చంపేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఎడమ చేతిపై తేనెటీగలు తేనె తొట్టెను ఏర్పాటు చేసుకున్నాయి. పైగా అతను పిడికిలి బిగించి నడుస్తుంటే మిగతా తేనెటీగలు అతని చేతికి వేలాడుతూ ఉండడం చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: