వరుడి కట్నం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!!

Divya
ఆడపిల్లలు ఉండే ప్రతి ఒక్క ఇంట్లో కూడా వారి చదువు.. ఆ తర్వాత వివాహం గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు తల్లిదండ్రులు. ముఖ్యంగా కట్న కానుకలు, వరుడు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అయితే కట్నం అనేది అల్లుడికి ఇవ్వడం ఎప్పటినుంచో ఆచారంగా కొనసాగుతూనే ఉన్నది.. వివాహంలో ఖచ్చితంగా ఎంతో కొంత నగదును వధువు కుటుంబ సభ్యులు వరుడుకి ఇస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి వారికి హైకోర్టు ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఎక్కువగా విడాకుల వ్యవహారాలు ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో ఒక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేరళ ప్రభుత్వం వరకట్నం తీసుకున్న వారికి డిగ్రీ పట్టాన్ని రద్దు చేసే విధానాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది .దీంతో తాజాగా తెలంగాణలో కూడా ఈ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఉండే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ లెక్చరుగా పనిచేస్తున్న శ్రీనివాస్ మాధవ్ కేరళ వరకట్న వ్యతిరేక విధానాన్ని అధ్యయనం చేయడం జరిగింది. రెండు సంవత్సరాల క్రితమే కేరళలో వరకట్న వ్యతిరేక విధానం అమల్లోకి వచ్చినప్పటికీ విద్యార్థులు తల్లితండ్రుల వైఖరిలో మార్పు రావడం జరిగింది అంటూ తెలియజేశారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేందుకు పలు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర మహిళ కమిషనర్ కు ఒక ప్రతిపాదనను సమర్పించడం జరిగింది ప్రభుత్వం ప్రస్తుతం ప్రతివాదనను అవసరమైన ప్రోటోకాల్న పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఉన్నత విద్యా మండలిత పాటు మహిళ శిశు సంక్షేమ శాఖలతో సమావేశమైన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతే అధికారికంగా ప్రకటించాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా కట్నం తీసుకున్న వెంటనే డిగ్రీ పట్టా రద్దు చేసే విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏ మేరకు ఇది అమలు అవుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: