వైరల్ : ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావ్?

praveen
ట్రాఫిక్ రూల్స్ ప్రకారమైతే బండి బయటకి తీయాలి అంటే తప్పనిసరిగా తలపై హెల్మెట్ ఉండాల్సిందే. హెల్మెట్ లేకుండా ఒకవేళ బండి నడిపితే మాత్రం పోలీసులు పట్టుకుని ఇక జరిమానా వేస్తూ ఉంటారు. ఒకవేళ పోలీసులు లేకపోయినా ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందిస్తూ ఉంటాయి. దీంతో చలాన్ ఏకంగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఎంతోమంది యువకులు అటు హెల్మెట్ పెట్టుకోకుండానే రైయ్ రైయ్ మంటూ బైక్ నడుపుతూ ఉంటారు.

 హఠాత్తుగా వెళ్లేదారిలో పోలీసులు కంటపడ్డారు అంటే చాలు హెల్మెట్ పెట్టుకోకుండా ఇక వాహనదారులు పోలీసులకు దొరికిపోవడం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం అతి తెలివి ఉపయోగించి ఇక పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇక్కడ ఒక కుర్రాడు హెల్మెట్ పెట్టుకోకుండానే స్కూటీ నడుపుతున్నాడు. ఇంతలో ఎదురుగా ఒక పోలీస్ కనిపించాడు. దీంతో ఆ పోలీసు నుంచి తప్పించుకునేందుకు ఆ కుర్రాడు ఆలోచించిన విధానం చూసిన తర్వాత మాత్రం ఎక్కువగా సినిమాల్లో వినిపించే ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావ్ అనే డైలాగ్ చెప్పకుండా ఉండలేరు.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడంటే.. ముందుగా హెల్మెట్ లేకుండానే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. కానీ మార్గమధ్యమంలో ఒక ట్రాఫిక్ పోలీస్ అతనికి కనిపించాడు. దీంతో అతన్ని దాటుకుని వెళ్లడం ఎలా అని ఆలోచిస్తే.. అతనికి ఒక ఆలోచన తట్టింది. దీంతో పెట్రోల్ అయిపోయినట్లుగానే తన బండిని ముందుకి తోసుకు  వెళ్లడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన ఒక బైకర్ అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఏమైంది పెట్రోల్ అయిపోయిందా అని అడిగితే ఇక పక్కనే పోలీసు ఉన్నాడు అందుకే అలా వెళ్తున్నాను అని చెప్పి కొంచెంముందుకు వెళ్లగానే స్కూటీ స్టార్ట్ చేసుకొని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: