గ్రామ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!

Divya
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొఫెషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది.. 2020 నోటిఫికేషన్లు ఎంపికైన సిబ్బందికి ప్రవేశం ఇస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి రోజున అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. శాఖపరమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు రెండు సంవత్సరాలు సర్వీసును పూర్తి చేసుకున్న వారికి ప్రొఫెషన్ వర్తిస్తుందని ఈ ఉత్తర్వులలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మే 1వ తేదీ నుంచి వారికి కొత్త పే స్కేల్ వర్తిస్తుందని గ్రామ వార్డు సచివాలయ శాఖ తెలియజేయడం జరిగింది.
ప్రొఫెషన్ ద్వారా సచివాలయ ఉద్యోగులకు భద్రత ఏర్పడడంతో పాటు ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వ్యవధిలోని సచివాలయ సిబ్బంది నియామకాలను చేపట్టడం జరిగింది.సచివాలయ సిబ్బందిని రెగ్యులర్ చేసేందుకు వీలు కల్పించే విధంగా ప్రొఫెషన్ డిక్లరేషన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని గత ఏడాది ఆమోదం తెలియజేసింది. గ్రామ వార్డు సచివాలయాలలో మొత్తం 19 రకాల కేటగిరి ఉద్యోగాలు ఉన్నాయి.. ప్రొఫెషన్ ఖరారైన గ్రేడ్ 5 పంచాయితీ సెక్రటరీలు వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీలు పే స్కేలు.. రూ.23,120 నుంచీ రూ.74,770 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అలాగే వీరి వేతనం డిఏ హెచ్ఆర్ కలుపుకొని రూ.29,598 రూపాయలు ఉంటుందని అధికారికంగా వర్గాలు తెలియజేస్తున్నాయి.
అయితే మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే స్కేలు విషయానికి వస్తే.. రూ.22,460 నుంచీ రూ.72,810 రూపాయలు ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది. ఈ కేటగిరి ఉద్యోగులకు డిఏ, హెచ్ఆర్ కలుపుకొని రూ.28,753 రూపాయలు ఉంటుంది.నిబంధనల ప్రకారం రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకోవడంతోపాటు డిపార్ట్మెంట్ టెస్ట్ ఉత్తీర్ణత.. ఎటువంటి నేరచరిత్ర లేదని రిపోర్టును జిల్లాల కలెక్టర్ ప్రవేశం కరారు అర్హులైన ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. 19 రకాల కేటగిరి ఉద్యోగులకు సంబంధించి ఆ జిల్లాలలోని కేటగిరీల వారీగా అర్హుల పేర్లను జాబితాను విడుదల చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: