వైరల్ : క్షణం ఆలస్యమైనా.. ఎంత ఘోరం జరిగేది?

praveen
మనిషి జీవితానికి ఒక సరైన ఉదాహరణ చెప్పాలి అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాంటిది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఘటన చోటు చేసుకుంటుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. అంతేకాదు మనిషి జీవితంలోకి ఎప్పుడు ఎవరు వస్తారు అన్నది కూడా చెప్పలేని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఉన్న దానికంటే మనిషి జీవితంలోనే ఎక్కువ ట్విస్టులు కనిపిస్తూ ఉంటాయి. మనిషి ప్రాణాలు పోవడం విషయంలో కూడా ఇలాంటి సస్పెన్స్ ఉంటుంది అని చెప్పాలి.

 అంతా సంతోషంగా సాగిపోతుంది. ఇలాంటి సమయంలో మనకు ఏమీ కాదు అని అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి. ఎన్నో ఊహించని ఘటనలు ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా అనుకోని ప్రమాదాలు ఎదురై కేవలం క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూసిన తర్వాత ఎంతోమందికి ఇక ప్రాణాలపై మరింత తీపి పెరిగిపోతూనే ఉంది. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక్క క్షణం ఆలస్యమైన ఏకంగా పిల్లాడి ప్రాణం పోయేది అని ప్రతి ఒక్కరు ఉలిక్కిపడతారూ.

 వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే నలుగురు అయిదుగురు పాదచారులు నడుచుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో ఒక బైక్ హఠాత్తుగా వచ్చింది. అలాంటి సమయంలోనే అప్పటివరకు రోడ్డు పక్కన నిలబడిన ఒక పిల్లాడు ఇక మరోవైపుకు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో వేగంగా వస్తున్న బైక్ అతని ఢీకొట్టబోయింది. అయితే ఇంతలో అటువైపుగా వెళ్తున్న పాదచారుల్లో ఒక అతను సూపర్ మ్యాన్ లాగా మెరుపు వేగంతో పిల్లాడిని సింగల్ హ్యాండ్ తో పక్కకు లాగేసాడు. దీంతో రెప్పపాటు కాలంలో ప్రాణాలు కోల్పోవాల్సిన బాలుడు కాస్త చివరికి బయటపడ్డాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: