Viral: గిన్నిస్ రికార్డు సృష్టించిన ఒంటె?

Purushottham Vinay
పైన కనిపించే ఫొటోలో ఉన్న ఒంటె చాలా ఎక్కువ కాలం జీవించిన ఒంటెగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును నమోదు చేసుకుని ఆ ఒంటె చరిత్ర సృష్టించింది. జనవరి 1996 వ సంవత్సరంలో అమెరికాలో జన్మించిన ఈ ఒంటె పేరు దలైలామా. మెక్సికోలోని అల్బుకెర్కీకి చెందిన ఈ 27 ఏళ్ల ఒంటె అమెరికాలోని అత్యంత పురాతన జీవి కూడా . ఇక ఇందుకు సంబంధించి పశుసంవర్ధక డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఒంటె వయస్సు సరిగ్గా 27 సంవత్సరాల 1 రోజుగా వెరిఫై చేసింది. ఇందులో వింత ఏంటంటే తన సంతానం కంటే ఎక్కువ కాలం జీవించిన జీవి కూడా ఇదే కావడం విశేషం. జంతు నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. ఒంటెలు సాధారణంగా కేవలం 20 సంవత్సరాల జీవితకాలం మాత్రమే కలిగి ఉంటాయి. కానీ ఈ రికార్డును దలైలామా అనే పేరు గల ఈ ఒంటె బద్దలు కొట్టడం జరిగింది.2


007 వ సంవత్సరం నుంచి ఆండ్రూ థామస్ కుటుంబం వారి కుమార్తె సామీ కోసం ఒంటెలను పెంచుతోంది. 14 సంవత్సరాల క్రితం ఈ కుటుంబంలో చేరిన లామాకు అంతకుముందు డీఎం టామీ ట్యూన్ అని పేరు పెట్టడం జరిగింది. 2007 వ సంవత్సరం తర్వాత ఇది కుటుంబంలో సభ్యుడిగా మారింది. అందువల్ల దీనికి కొత్త పేరు పెట్టబడింది.ఇక ఇంతకు ముందు, న్యూ మెక్సికోలోని డోర్సే మాన్షన్ రాంచ్‌లో నివసించే డోర్సే కుటుంబం లామాను పెంచింది. డోర్సే కుటుంబం తమ పిల్లల కోసం ఒక లామాను దత్తత తీసుకోవడం జరిగింది. ఇంకా ఇది కాకుండా, ఇది నెట్‌వర్క్ 4-H ప్రాజెక్ట్‌లో కూడా చేర్చబడింది. ఈ ప్రాజెక్ట్ అనేది అమెరికన్ ఆధారిత యువజన సంస్థచే చేయబడుతుంది.అమెరికాలోని గ్రామీణ ఇంకా పట్టణ ప్రాంతాల్లోని పిల్లలకు చేరుతుంది.ప్రస్తుతం ఈ ఒంటె సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: