గాల్లో నుంచి దూసుకొచ్చి తగిలిన వస్తువు.. అదృశ్యమైన బైకర్?

praveen
సాధారణంగా రహదారిపై ప్రయాణం చేస్తున్న సమయంలో ఇక ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పటికీ ఇతరుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం ముంచుకొచ్చి చివరికి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటూ ఉంటారు ఎంతోమంది వాహనదారులు. కొన్ని కొన్ని సార్లు వాహనదారులు మాత్రమే కాదు ప్రకృతి కూడా పగబట్టినట్లుగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఇలా ఇటీవల కాలంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తెరమీదకి వస్తూ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత ఒకసారి రోడ్డుపైకి వాహనంతో వెళ్లిన తర్వాత ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇక ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే ఇక తప్పించుకోవడానికి కూడా ఎలాంటి అవకాశం ఉండదు అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందింది.

 ఒక వ్యక్తి బైక్ పై వేగంగా వెళుతున్నాడు. ఇలాంటి సమయంలోనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ గాల్లోంచి ఏదో తెలియని వస్తువు ఎగురొచ్చి అతని బలంగా ఢీ కొట్టింది. దీంతో అతను తప్పించుకునే సమయం కూడా లేకుండా పోయింది అని చెప్పాలి.  అతన్ని ఆ వస్తువు వేగంగా ఢీ కొట్టిన దాటికి బైక్ పైకి నుంచి ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. ఇక అతని వాహనం కొంత దూరం వరకు అలాగే వేగంగా దూసుకుపోయి చివరికి రోడ్డు పక్కన పడింది. అయితే ఇక అతను బైక్ పై ఎగిరి పడిన వేగం చూసిన తర్వాత అతను ఒక్కసారిగా అదృశ్యమైనట్లే కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: