నీటిలో నల్లటి ఆకారం.. ఏంటా అని తోక పట్టుకుని చూస్తే మైండ్ బ్లాక్?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే ఎన్నో చిత్ర విచిత్రమైన వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలోకి వస్తు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో అందరిని ఆశ్చర్యపరచడం కాదు ఏకంగా భయాందోళనకు గురిచేస్తుంది అని చెప్పాలి.

 ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద జీవులలో అనుకొండ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అనకొండ ఇక ఎంత ప్రమాదకరమైనది అన్న విషయాన్ని ఒక హాలీవుడ్ సినిమా ద్వారా అందరూ తెలుసుకున్నారు. ఇక నీళ్లల్లో ఉండే ఈ అనకొండ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా వీడియోలలో కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే అనకొండలు ప్రమాదకరమైన మోసళ్లను సైతం అమాంతం మింగేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఏకంగా ఒక భారీ అనకొండ సంబంధించిన వీడియో అందరికీ గుండెలు అదిరిపోయేలా చేస్తూ ఉంది అని చెప్పాలి.

 ఇటీవల ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక వ్యక్తి చిన్న పడవలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. స్థానికంగా సరస్సులోకి వెళ్లిన అతడు ఎన్నో చేపలు పడతాయని ఊహించాడు. కానీ అక్కడ జరిగింది మాత్రం మరొకటి. ఏకంగా ప్రాణాలు పోయినంత పని అయింది అని చెప్పాలి.  ఇక అతను పడవలో నీటిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో పెద్దగా నల్లటి ఆకారం కనిపించింది. అదేంటో అతనికే అర్థం కాలేదు. దీంతో ఆ జీవి తోక పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కడ భారీ అనకొండ ప్రత్యక్షమైంది. ఏకంగా అక్కడ నీటిలో అనకొండ కదులుతూ ఉంటేనే అందరికీ భయం కలిగింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: