వైరల్ : విమానం గాల్లో ఉండగానే తెరుచుకున్న డోర్.. చివరికి?

praveen
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా విమానం ప్రమాదం జరిగింది అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక విమాన ప్రమాదం జరిగిన తీరు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఉంటారు. గత కొంతకాలం నుంచి మాత్రం విమానాలు హెలికాప్టర్లు ప్రమాదానికి గురవుతూ ఉండడం లాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎంతోమంది ఇలా విమానం క్రాష్ అవ్వడం లేదా సాంకేతిక లోపం కారణంగా గాల్లోనే మంటలు చెలరేగిపోవడం లాంటి ఘటనలు ఎన్నోసార్లు చూసి ఉంటారు.

 కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం మరింత విచిత్రమైనది అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటన గురించి ఎప్పుడూ కనీ విని ఎరిగి ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా విమానం గాల్లో దూసుకు వెళ్తున్న సమయంలో ఇక లోపలికి గాలి ప్రవేశించకుండా కిటికీలు డోర్లు అన్ని మూసి ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ విమానం మాత్రం అనూహ్యంగా గాల్లో ఉన్న సమయంలో డోర్ సగం వరకు తెరుచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోయింది. రష్యా కు చెందిన ఒక చార్టెడ్ ఫ్లైట్ ఆకాశంలో కిలోమీటర్లు ఎత్తులో ఉండగానే అనూహ్యంగా డోర్ తెరుచుకుంది. దీంతో  ప్రయాణికులు అందరూ భయాందోళనలో మునిగిపోయారు.

 ఇక ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతికారు. ఇక అభిమానం ఆకాశంలో ఉండగానే డోర్ ఇలా తెరుచుకోవడంతో గాలి అంతా విమానం లోకి వచ్చేసింది. అంతేకాదు ఇక విమానంలోని లగేజీని  సైతం గాలి పీల్చేసింది సైబీరియాలోని మగ్గన్ నుండి రష్యాలోని పసిఫిక్ తీరంలో ఉన్న మగడాన్కు విమానం బయలుదేరింది. అయితే మార్గమధ్యంలోనే విమానం వెనుక డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. అందులో ఆరుగురు సిబ్బంది 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. పైలెట్ అప్రమత్తమయి విమానాన్ని వెనక్కి తీసుకెళ్లి మగన్ లో ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: