ఇది కదా మిరాకిల్ అంటే.. చూస్తే నవ్వాపుకోలేరు?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ఎన్నో వింతలకు విశేషాలకు చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకునేందుకు ఎంతోమంది తమలో ఉన్న క్రియేటివిటీని బయటపెట్టి ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక ప్రతిరోజు లక్షల వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ నెటిజెన్స్ దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారిపోతూ ఉన్నాయి.

 ఇక కొన్ని వీడియోలు అయితే ఏకంగా పగలబడి నవ్వేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఏకంగా సినిమాల్లో కొన్ని ఫన్నీ సన్నివేశాలను రిపీట్ చేసే విధంగా ఇక సోషల్ మీడియాలో వీడియోలు ఉంటాయి అని చెప్పాలి.  అయితే సింహాద్రి సినిమాలో వేణుమాధవ్ కాళ్లు చచ్చుబడిపోయినట్లుగా డ్రామాలు చేయడం.. ఇక ఆ డ్రామా ని గుర్తించిన హీరో తనదైన శైలిలో ఝలక్ ఇచ్చి నిజం బయటపడేలా చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక అచ్చంగా ఇలాంటిదే ఇక్కడ జరిగింది. ఇక ఇది చూసి నేటిజన్స్ కూడా తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. ఇది కదా అసలైన మిరాకిల్ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

 ఇంతకీ ఏం జరిగిందంటే ఇటీవల ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక వ్యక్తి వీల్ చైర్ పై కూర్చుని భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఇక అతి కష్టం మీద వీల్ చైర్ ను నెట్టుకుంటూ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంతలో ఊహించిన ట్విస్ట్.. ఏకంగా ఉపద్రవం లాగానే అతని వీల్ చైర్ వైపు ఒక బైకు దూసుకు వచ్చింది. అయితే జెట్ స్పీడ్ తో బైక్ దూసుకు రావడాన్ని గమనించిన సదరు వ్యక్తి ఒక్కసారిగా వీల్ చైర్ పైనుంచి లేచి పరుగులు తీశాడు. దీంతో అతనికి నిజంగా కాళ్లు చచ్చుబడి పోలేదని భిక్షాటన చేయడానికి అలా నటించాడు అన్న విషయం తెలిసి అందరూ నవ్వుకుంటున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: