కుక్కను హింసిస్తున్న వ్యక్తి.. అంతలో ట్విస్ట్ ఇచ్చిన ఆవు?

praveen
ఇటీవల కాలంలో కుక్కలను పెంచుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కొంతమంది జంతు ప్రేమికులు ఎంతో ఇష్టంగా కుక్కలను కొనుగోలు చేసి ఇక ఇంట్లో పెంచుకుంటూ ఉంటే.. మరి కొంత మంది మాత్రం ట్రెండ్ ఫాలో అవ్వడానికి కుక్కలను పెంచుకుంటూ ఉండటం గమనార్హం.   ఏదేమైనా ఇటీవల కాలంలో మనిషికి పెంపుడు కుక్కలకి మధ్య బంధం మరింత బలపడింది అన్నదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయని చెప్పాలి. అంతేకాదు ఇక మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే కుక్కల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్న జంతు ప్రేమికులు కూడా కనిపిస్తున్నారు.

 అదే సమయంలో విశ్వాసానికి మారుపేరైన కుక్కల విషయంలో ఎంతో మానవత్వంతో మెలగాల్సిన కొంతమంది మనుషులు మాత్రం ఏకంగా దారుణంగా దాడులకు పాల్పడుతూ రాక్షసానందాన్ని పొందుతున్న ఘటనలు కూడా నేటి రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇలా ఎంతోమంది ఆకతాయిలు కుక్కలను దారుణంగా హింసించడం లాంటి వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి.

 కుక్కను దారుణంగా హింసిస్తూ రాక్షసానందాన్ని  పొందుతున్న ఒక వ్యక్తి తాటతీసింది ఆవు. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి కనీసం మానవత్వాన్ని మరిచి కనికరం లేకుండా ఒక కుక్కను రెండు చెవులు పట్టుకుని కొట్టడం మొదలుపెట్టాడు.  దీంతో ఇక అతని వేధింపులు తట్టుకోలేకపోయిన కుక్క గట్టిగా అరుస్తుంది. అంతలో అక్కడికి ఒక ఆవు పరిగెత్తుకుంటూ వస్తుంది. కుక్కను హింసిస్తున్న సదరు వ్యక్తిని కొమ్ములతో కుమ్మేస్తోంది. దీంతో భయపడిపోయిన సదురు వ్యక్తి కుక్కను వదిలేసాడు. ఇది చూసిన ఎంతో మంది నేటిజన్స్ మనుషుల్లో మానవత్వం లేకపోయినా జంతువుల్లో మాత్రం సాటి మనిషికి సహాయం చేయాలని గుణం ఇంకా బ్రతికే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: